అన్వేషించండి

Warangal: వరంగల్‌లో ఉప్పలయ్య హోటల్ తెలుసా? కేంద్ర ప్రభుత్వ అవార్డు ఎలా వచ్చింది?

Narsampet News: సాదాసీదా గల్లీలో చిన్న రేకుల ఇంట్లోని ఈ హోటల్‌కు భారత ప్రభుత్వం నుంచి అవార్డు కూడా వచ్చింది. అదే ఈ ఉప్పలయ్య హోటల్. ఏంటి ఈ హోటల్ ప్రత్యేకత?

Telugu News: హోటల్ అనగానే ప్రధాన రోడ్డు వెంట భారీ బోర్డులు, రంగురంగుల లైటింగ్ తో కస్టమర్లను ఆకట్టుకోవడం విశ్వ ప్రయత్నం చేస్తారు. అంతే కాదు వినూత్నంగా డైనింగ్ టేబుల్స్, మెనూ కార్డ్ టేబుల్ పైన ఉంటాయి. కానీ ఈ హోటల్లో ఇవేమి కనిపించవు. సాదాసీదా గా ఓ గల్లీలో చిన్న రేకుల ఇంట్లో. ఇంటి బోజనంలా రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న హోటల్ భారత ప్రభుత్వం నుండి అవార్డు అందుకుంది వరంగల్ జిల్లాలోని ఉప్పలయ్య హోటల్.

ఇంటి భోజనం రుచి....
ఉరుకులు పరుగుల జీవితంలో ఇంటికి వెళ్లి భోజనం చేసే సమయం లేదు. దీంతో గల్లీ కో రెస్టారెంట్ లు, హోటల్స్ వెలుస్తున్నాయి. బీజీ జీవితంలో ఎక్కడో అక్కడ తినాల్సిన పరిస్థితి. జనాలు కూడా ఫాస్ట్ ఫుడ్, బిర్యాని లు తినే కాలం. అయినా సదా సీదా సాంప్రదాయ భోజనం అందిస్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన శ్రీనివాస్. 30 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ తండ్రి ఉప్పలయ్య ఆయన పేరుతో నర్సంపేట పట్టణంలోని సుభాస్ కాలనీలో తన చిన్న ఇంట్లో ఇంటి  భోజనాన్ని ప్రారంభించారు. ఇంట్లో అమ్మ భార్య చేసే రుచిని అందిస్తూ అందరిని మన్ననలు పొందారు ఉప్పలయ్య. దీంతో హోటల్  చిన్నదా పెద్దదా అనే సంబంధం లేకుండా రుచికరమైన ఇంటి భోజనాన్ని అందిస్తుండడంతో ఉప్పలయ్య హోటల్ భారత ప్రభుత్వం గుర్తించే స్థాయికి ఎదిగింది.

Warangal: వరంగల్‌లో ఉప్పలయ్య హోటల్ తెలుసా? కేంద్ర ప్రభుత్వ అవార్డు ఎలా వచ్చింది?

కుటుంబమే వర్కర్స్...
ఈ హోటల్ లో బయటి వర్కర్స్ తో పని చేయించకుండా. ఉప్పలయ్య ఆయన కుమారుడు, కూతురు, కోడలు స్వయంగా వంతచేయడం, హోటల్ కు వచ్చే కస్టమర్స్ కు వడ్డించడం చేస్తారు. దీంతో రుచిలో తేడా రాకపోవడంతో మనం తినే భోజనాన్ని అందించాలని హోటల్ ను నడిపాడు ఉప్పలయ్య. అయితే ఉప్పలయ్య  2004లో మరణించారు. అప్పటికే ఉప్పలయ్య కుమారుడు శ్రీనివాస్ హోటల్ నిర్వహణలో కొనసాగుతుండటంతో తండ్రి అందించిన ఇంట్లో తినే భోజనాన్ని అందిస్తుండడంతో విజయవంతంగా కొనసాగుతుంది. మూడు రకాల కూరగాయలు, పచ్చిపులుసు, పెరుగుతో 90 రూపాయలకు ఫుల్ భోజనం అందిస్తారు. ఇక్కడికి పచ్చ పెన్ను ఉద్యోగి నుండి దినసరి కూలీ ఇక్కడ భోజనం చేసి వెళ్తారు. వివిధ పనుల మీద నర్సంపేట పట్టణానికి వచ్చిన వారు ఇంటి భోజనం చేయాలనుకుంటే ఉప్పలయ హోటల్ కు వస్తారు.

రుచికి మెచ్చి కేంద్ర ప్రభుత్వ అవార్డు

అయితే రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ( మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ ) అధికారులు విధినిర్వహణలో నర్సంపేట కు వచ్చారు. భోజనం కోసం ఉప్పలయ్య హోటల్ లో భోజనం చేసి వెళ్ళారు. తిరిగి ఆగస్టు 12వ తేదీన వచ్చి భోజనం చేసిన తరువాత సాధారణ ధరకు నాణ్యమైన, రుచికర భోజనం అందించి నందుకు ఉప్పలయ్య హోటల్ యజమాని శ్రీనివాస్ కు అవార్డు అందజేశారు. హోటల్ అధికారులు మెచ్చుకొని అవార్డు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యానని శ్రీనివాస్ తెలిపారు.Warangal: వరంగల్‌లో ఉప్పలయ్య హోటల్ తెలుసా? కేంద్ర ప్రభుత్వ అవార్డు ఎలా వచ్చింది?

కట్టెల పొయ్యి మీద వంటలు

ఈ హోటల్లో అన్నం కూరలు సాంప్రదాయపడ్డంగా కట్టెల పొయ్యి మీద వండడం జరుగుతుంది. పోపుకు సంబంధించిన వాటిని మాత్రమే క్లాస్ మీద చేయడం జరుగుతుంది శ్రీనివాస్ తెలిపారు. 150 నుండి 200 భోజనాలు అందిస్తానని చెప్పారు. భోజనం చేసిన వారు రుచికరంగా ఇంట్లో తిన్నట్టు ఉందని అంటే ఆనందం అనిపిస్తుందని  శ్రీనివాస్ అన్నారు. 

Warangal: వరంగల్‌లో ఉప్పలయ్య హోటల్ తెలుసా? కేంద్ర ప్రభుత్వ అవార్డు ఎలా వచ్చింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Chandra Babu: అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
Devara AP Ticket Rates: ‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యిSinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Chandra Babu: అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
Devara AP Ticket Rates: ‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
Tirumala Laddu Issue: లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
Indian Family : ఐర్లాండ్‌లో ఇల్లు కొనుక్కున్న భారతీయ కుటుంబం - జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వ్యక్తి - సోషల్ మీడియా రియాక్షన్ ఎలా ఉందంటే ?
ఐర్లాండ్‌లో ఇల్లు కొనుక్కున్న భారతీయ కుటుంబం - జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వ్యక్తి - సోషల్ మీడియా రియాక్షన్ ఎలా ఉందంటే ?
Jagan vs BJP: నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Embed widget