అన్వేషించండి

Warangal: వరంగల్ క్రికెటర్ పుట్టుకతోనే వినలేడు, మాట్లాడలేడు - అయినా ఐపీఎల్‌కు సెలెక్ట్!

Telangana News: బధిర, మూగ క్రీడాకారులతో నిర్వహించే ఐపీఎస్‌ కోసం హైదరాబాద్ టీంకు వరంగల్ క్రీడాకారుడు ఎంపికైయ్యాడు. గల్లి నుండి జాతీయ స్థాయి క్రికెట్ లోకి అరంగేట్రం చేయనున్నాడు.

Warangal News: మారుమూల గ్రామం, నిరుపేద కుటుంబం నుండి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు ఓ క్రీడాకారుడు. అయితే అతను చెవిటి, మూగ. విభిన్న ప్రతిభావంతుడైన క్రికెటర్ రాజు.. బధిర, మూగ క్రీడాకారులతో నిర్వహించే ఐపీఎస్‌ కోసం హైదరాబాద్ టీంకు ఎంపికైయ్యాడు. గల్లి నుండి జాతీయ స్థాయి క్రికెట్ లోకి వచ్చిన రాజు భూపాలపల్లి జిల్లా పెద్దంపల్లి గ్రామానికి చెందిన వాడు.

సైగలు చేస్తూనే పసుల రాజు మరొకరితో కమ్యూనికేట్ అవ్వగలడు. పుట్టుకతో చెవిటి, మూగవాడు. నిరుపేద వ్యవసాయ కుటుంబం కావడంతో పదవ తరగతి పూర్తి చేశాడు. అయితే రాజుకు చిన్ననాటి నుండి క్రికెట్ అంటే తెగ పిచ్చి. గల్లి క్రికెట్ నుండి ఎదిగిన రాజు ఇంటర్ చదువుతూనే అంతర్ జిల్లా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడారు. ఇంటర్ తరువాత టీ 20 మ్యాచ్ లు ఆడాడు. రాజు ఫాస్ట్ బౌలర్ తోపాటు బ్యాట్స్ మెన్. ఇతను ఆడిన ప్రతి మ్యాచ్ లో ప్రతిభ కనబర్చేవాడు. పుట్టుకతో చెవిటి , మూగ కావడంతో రాజు ప్రతిభను గమనించిన తెలంగాణ చెవిటి, మూగ క్రికెట్ అసోసియేషన్ కోచ్ రాజారాం 2022 నుండి హైదరాబాద్ లో కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే రాజారాం కూడా చెవిటి, మూగనే. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల చెవిటి, మూగ క్రికెట్ అసోసియేషన్ లు నిర్వహించిన మ్యాచ్ ల్లో అనేక మెడల్స్, సర్టిఫికెట్స్ సాధించారు. 


Warangal: వరంగల్ క్రికెటర్ పుట్టుకతోనే వినలేడు, మాట్లాడలేడు - అయినా ఐపీఎల్‌కు సెలెక్ట్!

2025 మార్చిలో జరిగే చెవిటి, మూగ ఐపీఎల్ టోర్నమెంట్ కు జరిగిన క్రీడాకారుల ఎంపికలో రాజు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కు ఎంపికయ్యాడు. ఈ టీంలో క్రీడాకారులంతా హైదరాబాద్ వాళ్ళు కావడం, ఒక్క రాజు మాత్రం వరంగల్ కావడం విశేషం. దీంతో రాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో పదిరోజుల్లో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లకు వెళ్లనున్నారు. రాజు ఐపీఎల్ కు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అంటే ఇష్టమని తల్లిదండ్రులు చెప్పారు. మాటలు రావని బాధపడే వాళ్ళమని తల్లి చెప్పింది.


Warangal: వరంగల్ క్రికెటర్ పుట్టుకతోనే వినలేడు, మాట్లాడలేడు - అయినా ఐపీఎల్‌కు సెలెక్ట్!

గ్రామాల్లో అందరితో కలివిడిగా ఉండే రాజు ఐపీఎల్ కు ఎంపిక కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఆడి గ్రామానికి పేరు తెస్తాడని ఎప్పుడు అనుకోలేదని స్నేహితులు, గ్రామస్తులు చెబుతున్నారు. రాజుకు క్రికెట్ అంటే పిచ్చి అని స్నేహితులు చెప్పారు. రాజు పేద కుటుంబం నుండి ఎదుగుతున్న క్రికెటర్ కాబట్టి ఆర్థికంగా సహాయం చేయని కోరుతున్నారు.
   
అయితే రాజు కూడా ఐపీఎల్ కు సెలెక్ట్ కావడంతో సంతోషం వ్యక్తం చేశాడు. తన తల్లిదండ్రుల కష్టానికి ఫలితం అని ఆయన సైగల్లో చెప్పారు. మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతానని రాజు తెలిపారు. రాజు అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగి మంచి విజయాలు సాధించాలని గ్రామస్తులు స్నేహితులు కోరుకుంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
Two Headed Snake: 2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
TS EAPCET 2026 Results : తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhuma Mounika Reddy: రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
Matsyakarula Sevalo Scheme: మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన సీఎం చంద్రబాబు, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన ఏపీ ప్రభుత్వం, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
NTR Neel Glimpse: 'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
MS Dhoni IPL Future: ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
Woman Harassment: చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
IPL 2026 RR VS LSG Result Update: వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్,
వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్
Tata Tiago Facelift: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ మే 28న విడుదల! అదిరిపోయే ఫీచర్లు, అప్‌డేటెడ్‌ డిజైన్‌తో ఎంట్రీ!
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ మే 28న విడుదల! అదిరిపోయే ఫీచర్లు, అప్‌డేటెడ్‌ డిజైన్‌తో ఎంట్రీ!
Embed widget