అన్వేషించండి

Waranlgal Politics: వరంగల్‌లో సీన్ రివర్స్, పార్టీకి ఏకైక ఎమ్మెల్యేలే - అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్

Telangana News: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. వరంగల్ రాజకీయాలు చూస్తే ఎవరైనా ఇదే అంటారేమో. గతంలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ కు వచ్చింది.

Telangana Politics single MLA for BRS in Warangal Distrcit: బండ్లు ఓడలు... ఓడలు బండ్లు అవుతాయి అనడానికి వరంగల్ జిల్లా రాజకీయాలే నిదర్శనం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవగా. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపెంచారు. కానీ గతంలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే మిగలగా.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉండి రాజకీయ చరిత్రలో నిలిచారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో రెండు సీట్లు
రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా పేరున ఉమ్మడి వరంగల్లో 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్యేలు తెలుసుకోగా బీఆర్ఎస్ పార్టీ 10 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు ఎమ్మెల్యేగా సీతక్క గెలుపొందారు. బీఆర్ఎస్  రెండోసారి అధికారంలోకి రావడంతో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చి గులాబీ కండువా కప్పుకొని కారెక్కారు. ఇక మరో ఎమ్మెల్యే సీతక్క పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అందులోనే కొనసాగారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు.
బీఆర్ఎస్ కు ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే..
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగడంతో 2018 ఎన్నికల రికార్డును తిరగరాసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన్ సైడ్ గా 10 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుం కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ రెండు ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందింది. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నుండి గెలవగా, జనగామ నియోజకవర్గం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం గుటికి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఏకైక ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత చరిత్ర రిపీట్ అయింది.

ఎమ్మెల్యేలు గెలిచిన ఆ పార్టీ అధికారంలో లేకపోవడంతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ మారే ముందు నేతలు చెబుతున్నారని తెలిసిందే. త్వరలో లోక్‌సభ ఎన్నికలు కావడంతో సీటు దక్కని ప్రజాప్రతినిధులు, నేతలు పక్క చూపులు చూస్తున్నారు. వేరే పార్టీలో ఉదయం చేరి రాత్రి టికెట్లు పొందిన నేతలు ఉన్నారు. నిన్న పార్టీ కండువా మార్చుకుని, 24 గంటల్లోపే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు సాధించుకున్నా వారు సైతం ఉన్నారు. పార్టీలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని సైతం విమర్శలు వచ్చినా వారు పట్టించుకోవడం లేదు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
Embed widget