అన్వేషించండి

జనగామలో గంటల వ్యవధిలోనే ఎస్సై దంపతుల ఆత్మహత్య

గంటల వ్యవధిలోనే ఎస్సై దంపతుల ఆత్మహత్య జనగామలో తీవ్ర విషదాన్ని నింపింది. అసలు వీళ్లిద్దరి ఆత్మహత్యలకు కారణమేంటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుంటే కాసేపటికే భర్త కూడా గన్‌తో కాల్చుకొని తనువు చాలించారు. 

జనగామ పట్టణంలో ఎస్సైగా పని చేస్తున్న కాసర్ల శ్రీనివాస్‌, భార్య స్వరూపతో కలిసి వెంకన్నకుంటలో నివాసం ఉంటున్నారు. తెల్లవారు జామున ఎస్సై శ్రీనివాస్ లేచి చూసేసరికి బాత్రూంలో భార్య ఉరివేసుకొని విగతజీవిగా పడి ఉన్నారు. దాన్ని చూసి షాక్ అయిన శ్రీనివాస్‌.. విషయాన్ని బంధువులకు చెప్పారు. 

భార్య మరణంతో బోరున విలపించారు. బంధువులు, స్నేహితులు శ్రీనివాస్‌ ఇంటికి వచ్చి పరామర్శించారు. ఈ పరామర్శలు జరుగుతుండగానే... వాష్‌రూంకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లారు. ఇంతలో గన్ సౌండ్ వినిపించింది. ఏమైందో ఏమో అని స్నేహితులు వెళ్లి చూడగా రక్తపు మడుగులో శ్రీనివాస్ పడి ఉన్నారు. 

డోర్‌ తెరిచి చూస్తే తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నట్టు గుర్తించారు. గంటల వ్యవధిలోనే భార్యభర్త ఇలా సూసైడ్‌ చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

రెండు ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం ఎస్సై దంపతుల మృతదేహాలను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరుగుపొరుగు వారి నుంచి, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 

భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని రాత్రి కూడా ఏదో తగాదా జరిగిందని స్థానికులు చెబుతున్నారు ఈ కారణంతోనే ఎస్సై దంపతులు సూసైడ్ చేసుకొని ఉంటారని సమాచారం. వివాదాలతో భార్య చనిపోతే... ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త చనిపోయి ఉంటాడని చెప్పుకుంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Venkatesh Nandamuri Kalyan Ram : వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
Horror Movies : ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
LPG Imports: చైనాకు వెళ్లాల్సిన ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌ మళ్లాయి! ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి వస్తున్న ఎల్పీజీ కార్గో !
చైనాకు వెళ్లాల్సిన ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌ మళ్లాయి! ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి వస్తున్న ఎల్పీజీ కార్గో !
HMPV Symptoms: ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
Embed widget