By: ABP Desam | Updated at : 08 Jul 2023 10:55 AM (IST)
వరంగల్‌లో మోదీ టూర్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం వారణాసి నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట చేరుకున్న నరేంద్రమోదీని మంత్రులు, బీజేపీ అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో మమూనూరు చేరుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మార్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో పండితులు పూర్ణకుంభంతో మోదీకి ఘనస్వాగతం పలికారు.
భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే సుమారు 20 నిమిషాలు గడిపారు. వేదపండితులతో మాట్లాడారు. అక్కడి నుంచి బయల్దేరి హన్మకొండలో ఏర్పాటు చేసిన సభ వద్దకు చేరుకుంటారు. అక్కడ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
Leaving for Warangal to attend a programme where we will inaugurate or lay the foundation stone for development works worth over Rs. 6100 crores. These works cover different sectors ranging from highways to railways. They will benefit the people of Telangana.
— Narendra Modi (@narendramodi) July 8, 2023
మోదీ తెలంగాణ టూర్‌కు బయల్దేరి ముందు ఓ ట్వీట్ చేశారు. తాను తెలంగాణలో పర్యటిస్తున్నానని... ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. వాటి విలువ 6100 కోట్లు అని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు హైవే నుంచి రైల్వేస్ వరకు ఉన్నాయని వివరించారు. ఇవి తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
TSSPDCL Jobs: విద్యుత్ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి
Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం
KNRUHS: బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ
PM SHRI: తెలంగాణలో 279 హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌లు, ఒక్కో పాఠశాలకు రూ.16 లక్షలు మంజూరు
DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
/body>