అన్వేషించండి

Errabelli on Chandrababu : ప్రజలంతా ఎన్టీఆర్‌ను కోరుకుంటున్నారు, లోకేష్‌ను కాదు: ఎర్రబెల్లి

Errabelli on Chandrababu : టీడీపీ చంద్రబాబుది కాదని.. ఆ పార్టీ ఎన్టీఆర్ ది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజలంతా జూనియర్ ఎన్టీఆర్ నే కోరుకుంటున్నారని, లోకేష్ ని కాదని స్పష్టం చేశారు. 

Errabelli on Chandrababu: తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఆ పార్టీ సీనియర్ ఎన్టీఆర్ ది అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రజలంతా జూనియర్ ఎన్టీఆర్ నే కోరుకుంటున్నారని, లోకేష్ ను ఎవరూ కోరుకోవట్లేదని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నే ముఖ్యమంత్రి చేయాలని చెప్పారు. 

నిజంగా ప్రేమ ఉండే జూనియర్ ఎన్టీఆర్ ను సీఎం చెయ్..

ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన చంద్రబాబు సభ తెలంగాణ రాజకీయ క్షేత్రంలో నిప్పును రాజేసింది. దీనిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ, ఆంధ్రాలో ఫెయిల్ అయి ఎక్కడ పొద్దుపోక బీజేపీతో ములాఖత్ అయ్యి చిచ్చుపెట్టే పని మొదలు పెట్టారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ దని అన్నారు. ప్రజలంతా జూనియర్ ఎన్టీఆర్ నే కోరుకుంటున్నారని, లోకేష్ ను ఎవరూ కోరుకోవట్లేదని తెలిపారు. నిజంగా చంద్రబాబుకు తెలుగు దేశంపై, ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని సవాల్ విసిరారు.

"తెలంగాణలో ఫెయిల్ అయిండు ఆయన. ఆంధ్రాల ఫెయిల్ అయిండు. ఇక్కడికి అచ్చి ఏదో చిచ్చుపెట్టాలని చూసిండు గతంలో కాంగ్రెస్ వాళ్లతో కలిసి. ఫెయిల్ అయింది. ఇప్పుడు బీజేపీ వాళ్లతో కలిసి ఏదో ములాఖత్ అయినట్లు అనిపిస్తా ఉంది. నేను ఒకటే అంటున్న. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పార్టీ కాదు. ఎన్టీ రామారావు పార్టీ. ఎన్టీ రామారావుకు ఉన్న స్ఫూర్తి, పేద ప్రజల కోసం ఆయన చేసినది ఇప్పటికీ కూడా రెండు రాష్ట్రాల ప్రజలు మర్చిపోరు. పేదల స్కీం ఇచ్చింది ఎన్టీ రామారావు. నువ్వు కాదు. గొప్పతనంగా చెప్పుకునుడు. ఎన్టీ రామారావు స్పూర్తి చెప్పు, ఎన్టీ రామారావు పేరు చెప్పు, ఎన్టీ రామారావుతో బతికినవ్. ఆయనను మోసం చేసినవ్. ఆ కుటుంబాన్ని మోసం చేసినవ్. నేను ఒకటే అంటున్న. ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉంటే... నీ కొడుకునేమో ఆంధ్రాల పెడ్తవ్. పాపం హరికృష్ణ బిడ్డనేమో తెలంగాణల పెట్టి ఓడ గడ్తవ్. ఇది కక్ష సాధింపు చర్య కాదా. నేను ఒకటే అంటున్న. అదే హరికృష్ణ కొడుకు ఉన్నాాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ను ప్రజలు కోరుకుంటున్నరు. నీ కొడుకును కోరుకుంట లేరు. జూనియర్ ఎన్టీఆర్ వస్తెనే బాగుంటది, ఆయన వస్తే పార్టీ బాగు పడ్తదని ఆంధ్ర ప్రజలను అనుకుంటున్నరు. వాళ్లంతా జూనియర్ ఎన్టీఆర్ అంధ్రల ముఖ్యమంత్రి అయితే బాగుంటదని కోరుకుంటున్నరు. లోకేష్ ను కోరుకుంటలేరు. అదే లోకేష్ ను ఎక్స్ పోస్ చేస్తున్నవ్. నీకు ఎన్టీ రామారావు మీద, తెలుగు దేశం పార్టీ మీద ప్రేమ ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి ఏపీలో సీఎం చెయ్. అప్పుడు నీ విశ్వాసాన్ని నేను నమ్ముత." - ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget