News
News
X

Erraballi Dayakar Rao: పొలంలోకి దిగి దున్నిన మంత్రి ఎర్రబెల్లి - సొంతూర్లో వ్యవసాయం

స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి వెళ్లి.. గొర్రు పట్టి ఎడ్లను సై సై అన్నారు.

FOLLOW US: 
Share:

రైతు బిడ్డ పొలాన్ని చూస్తే మురుస్తాడు.. ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్రానికి మంత్రి అయినా.. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. కాబట్టి, చాలా కాలం తర్వాత అరక పట్టారు. తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి వెళ్లి.. గొర్రు పట్టి ఎడ్లను సై సై అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గొర్రు పట్టి దున్నారు.

అందరితో కలిసి.. గొంతు కలిపి నాట్లు

దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్  పండగ చేశారని.. మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తమ నాయకుడి ఆశయ సాధనలో అడుగులు వేస్తామని అనడమే కాదు.. నేరుగా వ్యవసాయం చేస్తాం.. రైతు రాజు అయితే రాజు కూడా రైతు అనే దానిని రుజువు చేస్తున్నాం. కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు కూడా ఇష్టంగా వ్యవసాయం చేయడంతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింది. గతంలో నెర్రెలు పారిన పొలాలు.. స్వరాష్ట్రంలో ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయి. అన్నదాత కళ్లలో ఆనందం పండిస్తున్నాయి. అపర భగీరధుడు కేసీఆర్ ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొంది. నీళ్లు పరవళ్ళు తొక్కుతుంటే చెరువులు కుంటలు, నిండి ఉప్పొంగుతుంటే.. మంత్రులు కూడా సొంత పొలాల్లో దిగి వ్యవసాయం చేస్తుంటే.. ఊరు వాడ, చేను చెలక మళ్ళీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయి. నా తెలంగాణ కోటి ఎకరాల మగాణా అన్న నినాదం నిజం అయ్యింది’’ అని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

మహిళలకు రూ.3 లక్షల రుణం, పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి - మంత్రి ఎర్రబెల్లి

మహిళలకు మూడు లక్షల రూపాయల రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నామని, ఇందుకోసం తొలుత పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజక వర్గాన్ని ఎంపిక చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం అన్నారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యాక తెలంగాణ రాష్ట్రం అంతటా అమలు చేస్తామని చెప్పారు. జనగామలో దాదాపు 3 వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ఇవాళ హాజరు అయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలో మహిళలకు మంత్రి  కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి.. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లోని మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి, శిక్షణ కూడా ఇస్తామని మంత్రి వివరించారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

మహిళల సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేనన్ని కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని మంత్రి వివరించారు. శిక్షణ తీసుకున్న మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చేయడమై తన బాధ్యత అని చెప్పారు. మహిళా సాధికారత లక్ష్యంగా 3000 మందికి మహిళల కుట్టు మిషన్ శిక్షణా తరగతులనువ ప్రారంభించారు. అనంతరం శిక్షణ పొందే మహిళలు, స్థానిక నేతలు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండగా 7 సార్లు ఎన్నికల్లో గెలిచానని చెప్పారు. చాలా మంది సీఎంలను, పార్టీలను చూశాను కానీ సీఎం కేసీఆర్ లా ఎవరూ అభివృద్ధి చేయలేరని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయినప్పుడు తన నియోజక వర్గంలో, రాష్ట్రంలోని అక్కా, చెల్లెళ్లు కుండలు పట్టుకుని నీళ్ల కోసం నిలబడే వారని... నీళ్లకు బోరింగ్ వేస్తే చాలు అనేవాళ్లని గుర్తు చేశారు.

Published at : 27 Dec 2022 02:25 PM (IST) Tags: Erraballi dayakar rao Warangal Warangal News Minister Erraballi Parvathagiri

సంబంధిత కథనాలు

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం

Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం

YS Sharmila Padayatra: నెక్కొండ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల

YS Sharmila Padayatra: నెక్కొండ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల

Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై

Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్‌

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్‌

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!