Govt of India Funds To Medaram Jathara: సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.2.5 కోట్లు నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
Govt of India has approved Rs 2.5 Crore to Medaram Jathara: సమ్మక్క సారలమ్మ మేడారం జాతర గిరిజన పండుగలలో ఒకటి, ఈ పండుగకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Govt of India has approved release of Rs 2.5 Crore to Sammakka Saralamma Jathara: భారత ప్రభుత్వం అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర (Medaram Jathara)కు రూ.2.5 కోట్ల నిధులు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర గిరిజన పండుగలలో ఒకటి, ఈ పండుగకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం గిరిజన ప్రజల విశిష్ట సంస్కృతి మరియు వారసత్వా న్ని గౌరవిస్తుందని చెప్పారు.
‘స్వదేశ్ దర్శన్ పథకం క్రింద, కేంద్ర పర్యా టక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూ ట్ ల అభివృద్ధిలో భాగంగా 2016-17 లోనే దాదాపు 80 కోట్ల రూపాయలతో ములుగు - లక్నవరం - మేడవరం - తాడ్వా యి - దామరవి - మల్లూర్ - బోగత జలపాతాలలో సమగ్ర అభివృద్ధిని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మేడారంలో అతిథి గృహాన్ని , ఓపెన్ ఆడిటోరియం, పర్యా టకుల కోసం విడిది గృహాలు, త్రాగునీరు వంటి వివిధ సౌకర్యా లు, సోలార్ లైట్లు వంటి వాటిని ఏర్పా టు చేయడం జరిగింది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2014 నుండి ఇప్పటి వరకు కేంద్ర పర్యా టక మంత్రిత్వశాఖ తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా ఘనంగా నిర్వహించుకునే వివిధ పండుగల కోసం DPPH (Domestic Promotion and Publicity including Hospitality) పథకం కింద రూ. 2.45 కోట్ల (Central Govt Approved Funds To Sammakka Saralamma Jathara)ను మంజూరు చేసింది. స్వా తంత్య్ర ఉద్యమంలో సుమారు 85 తిరుగుబాట్ల లో పాల్గొన్న గిరిజన స్వా తంత్య్ర సమరయోధులకు గుర్తింపునిచ్చేందుకు దేశవ్యాప్తంగా 10 గిరిజన మ్యూ జియంలను నిర్మి స్తున్నామని చెప్పారు. ఇందులో తెలంగాణలో నిర్మి స్తున్న రామ్ జి గోండ్ గిరిజన మ్యూ జియం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు మ్యూజియం కూడా ఉన్నాయి. ఈ రెండు మ్యూజియాలకు ఒక్కొ క్క దానికి నిర్మా ణం కోసం కేంద్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మన స్వా తంత్య్ర సంగ్రామంలో అనేక పోరాటాలు సాగించి ఇప్పటి వరకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్న ప్రముఖ ఆదివాసీ స్వా తంత్య్ర సమరయోధులు భగవాన్ బిర్సా ముండా, కొమరం భీమ్, రామ్ జీ గోండ్, అల్లూరి సీతారామరాజు వంటి వారి పోరాటాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి దేశవ్యా ప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
సమ్మక్క సారలమ్మ మేడారం జాతర (Sammakka Saralamma Jathara))ను నిర్వహించటం కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పర్యా టక మంత్రిత్వ శాఖల ద్వా రా రు.2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర సాంస్కృతిక, పర్యా టక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. సమ్మక్క సారలమ్మ జాతర అతిపెద్ద గిరిజన జాతర, ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది గిరిజన ప్రజలు పెద్ద మొత్తంలో హాజరై జరుపుకునే అతిపెద్ద పండుగలలో ఒకటిగా చెప్పబడుతుంది. తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించేటటువంటి ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది.
గిరిజన సంస్కృతి మరియు వారసత్వా న్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్రను పాత్రను కేంద్ర మంత్రి నొక్కి చెబుతూ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం గిరిజన ప్రజల ప్రత్యేక సంస్కృతి మరియు వారసత్వాన్ని ఎంతగానో గౌరవిస్తుంది. అందువలన, సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను నిర్వహించటం కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పర్యా టక మంత్రిత్వ శాఖల ద్వా రా రు.2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2014 నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా ఘనంగా నిర్వహించుకునే వివిధ పండుగల కోసం పథకం క్రింద రు. 2.45 కోట్లను మంజూరు చేసిందని తెలియజేశారు.
ఈ నిధులను మేడారం (Medaram Jathara) నందు చిలకలగుట్ట చుట్టూ సంప్రదాయ రీతిలో 500 మీటర్ల కాంపౌండ్ గోడను నిర్మించటానికి, దానికి అనుసంధానంగా 900 మీటర్ల మెష్ ను ఏర్పా టు చేయటానికి, గోడల మీద గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా అధ్భు తమైన చిత్రాలను వేయటానికి, గిరిజన మ్యూ జియంలో డిజిటల్ సమాచార కేంద్రాలు ఏర్పా టు చేయటానికి, గిరిజన మ్యూ జియం పరిసరాలలో కోయ గ్రామాన్ని ప్రతిబింబించేలా నిర్మా ణాలు చేపట్టడానికి, ఐలాపూర్ సమ్మక్క జాతర, చిరుమల్ల సమ్మక్క జాతర, సాదలమ్మ తిరుణాల వంటి అనేక పండుగలు, వాటి విశిష్టత మీద పరిశోధనలు చేయడానికి, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, పెయింటింగ్ వంటి పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటానికి, కోయ డ్యా న్స్ట్రూప్స్, కొమ్ము కోయ, రేలా డ్యా న్స్ట్రూప్స్, పెయింటింగ్ వంటి వాటిని చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తించి వాటికి ఆర్థిక మద్ధతును అందించటానికి ఇలా అనేక రకాల కార్యక్రమాలకు ఉపయోగించటం జరుగుతుందని ఓ ప్రకటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో, భారత ప్రభుత్వం 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశాన్ని మరియుదేశంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి సంస్కృతులు మరియు విజయాల యొక్క అద్భు తమైన చరిత్రను స్మరించుకుంటుంది. గొప్ప గిరిజన స్వా తంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని ఇటీవలే మనం ‘జనజాతీయ గౌరవ్ దివస్ ’ గా జరుపుకున్నాం. మన స్వా తంత్య్ర సంగ్రామంలో అనేక పోరాటాలు సాగించి ఇప్పటి వరకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్న ప్రముఖ ఆదివాసీ స్వా తంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, రామ్ జీ గోండ్, అల్లూరి సీతారామరాజు వంటి వారి పోరాటాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి దేశవ్యా ప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని అన్నా రు. మన స్వాతంత్య్ర ఉద్యమంలో సుమారు 85 తిరుగుబాట్లలో పాల్గొన్న గిరిజన స్వా తంత్య్ర సమరయోధులకు గుర్తింపునిచ్చేందుకు దేశవ్యా ప్తంగా 10 గిరిజన మ్యూ జియంలను నిర్మి స్తున్నా మని అన్నా రు. బ్రిటిష్ వారి అణచివేత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మన వీరోచిత గిరిజన యోధుల పోరాటాలను ప్రదర్శి స్తాయని’ కిషన్ రెడ్డి వివరించారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం రూ.7,524.87 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తే, 2022-2023 ఆర్థిక సంవత్సరానికిగాను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం బడ్జెట్ ను గణనీయంగా పెంచి రూ.8,451.92 కోట్లను కేటాయించింది. “గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం కేటాయించిన బడ్జెట్ 12.32% పెరుగుదలను తెలియజేస్తుందని చెప్పారు. యూపీఏ పాలనలో గిరిజన సమాజానికి కేటాయించిన బడ్జెట్ కేటాయింపులలోని అసమతుల్యతను మా ప్రభుత్వం సరి చేస్తోందని అన్నా రు. ఇది రాజకీయ కోణంలో కాకుండా, గిరిజన సమాజంలోని యువతకు ఆర్థిక పురోగతి మరియు మెరుగైన అభివృద్ధి అవకాశాలను అందించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ విషయంలో మా ప్రభుత్వం 2022-2023 బడ్జెట్ అంచనాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గిరిజన విశ్వవిద్యా లయాలకు రూ.44 కోట్లు కేటాయించింది.
సంవత్సరాల తరబడి ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్న గిరిజన ప్రజలు అందించిన సహకారాన్ని గుర్తించి, వారికి సరైన గుర్తింపును అందించేలా చేయటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతేకాకుండా, మన జనాభాలో దాదాపు 10% ఉన్న 705 గిరిజన జాతుల యొక్క వారసత్వం, సంస్కృతి మరియు విలువలను పరిరక్షించటానికి కట్టుబడి ఉన్నా ము. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయబడిన ఈ మొత్తం, ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మా రి సమయంలో పండుగ కోసం సమర్థవంతమైన సన్నా హాలను ఏర్పా టు చేసుకోవటానికి ఉపకరిస్తుందని మరియు జాతీయ స్థాయిలో గిరిజనులకు ఒక విశిష్ట మైన గుర్తింపును తీసుకువస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావిస్తున్నారు.
Also Read: Medaram Jatara: సమక్క దేవత ఎలా అయింది? ఈ మహా జాతరకు దారితీసిన పరిస్థితులేంటి?
Also Read: Medaram Jatara: రాజుల్లేరు, రాజ్యాల్లేవు.. వనదేవతల కరుణ అలాగే ఉంది.. మరో కుంభమేళాను తలపించే మేడారం..