Mulugu Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్- ముగ్గురు మావోయిస్టులు మృతి
Telangana News: తెలంగాణ సరిహద్దుల్లో తుపాకులు గర్జించాయి. లోక్‌సభ ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం చేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్ట వద్ద భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అనంతరం ఘటనా స్థలం నుంచి తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మావోయిస్టు ప్రబావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే అనుమానిత ప్రాంతల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
వరంగల్‌కు సమీపంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి చెందారు. వరంగల్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో కరిగుట్టలు వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వారి వద్ద నుంచి ఒకే ఏకే 47, ఒక ఎల్‌ఎంజీ ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మధ్య కాలంలో తెలంగాణ సరిహద్దుల్లో నిఘా పెరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పోయే వారిపై ప్రత్యేక నజర్ పెట్టారు. దీంతో తరచూ కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు మావోయిస్టులు ప్లాన్ చేశారన్న అనుమానంతో తనిఖీలు సాగుతున్నాయి. రిక్రూట్‌మెంట్‌లు కూడా భారీగా జరుగుతున్నాయన్న సందేహాలు పోలీసుల్లో ఉన్నాయి.