అన్వేషించండి

Warangal News: దర్జాగా బీర్ తాగుతూ విధులు, టేబుల్‌పైనే లిక్కర్ బాటిల్ - గవర్నమెంట్ ఆఫీస్‌లో ఉద్యోగి వీడియో వైరల్

Mahabubabad News: గవర్నమెంట్ ఆఫీస్ టేబుల్ పై బీరు సీసా పెట్టుకొని మధ్యమధ్యలో సిప్ లు వేస్తూ ఓ ఉద్యోగి పని చేస్తున్న తీరు అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Mahabubabad Transport Office: ఆఫీసుకు మద్యం తాగి రావడం తప్పు అని అందరికీ తెలుసు. అలాంటిది కార్యాలయానికి వచ్చి తాగితే.. మరింత పెద్ద తప్పు అవుతుంది. కానీ, పని వేళల్లో ప్రజలకు తగిన సర్వీసు అందించాల్సిన సమయంలో ఓ వైపు తాగుతూ, మరోవైపు పని చేస్తుంటే.. అందులోనూ ప్రభుత్వ కార్యాలయంలో ఈ పని చేస్తే..? ఇది పెద్ద నేరమే అవుతుంది. కానీ, ఇలా ఎవరూ చేయరులే అనుకోవడానికి లేదు. ప్రభుత్వ కార్యాలయంలో, పని గంటల్లో ప్రజలకు సేవ చేస్తూనే మరోపక్క టీ తాగినట్లుగా బీరు తాగిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గవర్నమెంట్ ఆఫీస్ టేబుల్ పై బీరు సీసా పెట్టుకొని మధ్యమధ్యలో సిప్ లు వేస్తూ పని చేస్తున్న తీరు అందర్నీ విస్మయానికి గురి చేసింది.

భానుడు ప్రతాపాన్ని చూపిస్తుందడంతో ఎండ తాపం నుండి కాస్త సేద తీరడానికో ఏమో ఓ ఉద్యోగి కార్యాలయంలోనే చల్లని నీరు లాగించేశాడు. పాపం కార్యాలయానికి వచ్చిన ఎవరో ఫొన్ లో ఉద్యోగి బాగోతాన్ని బంధించారు. దీంతో ఉద్యోగి బండారం మొత్తం బయటకు వచ్చింది.

మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి మద్యం సేవిస్తూ విధులు నిర్వహించారు. అయితే సురేష్ కంప్యూటర్ ఆపరేటర్ గా నిధులు నిర్వహిస్తున్నాడు. ఎండ వేడిమి నుండి బయటపడడానికి ఎవరిని పట్టించుకోకుండా బీరు సేవిస్తూ కార్యాలయంలో తన పని తాను చేసుకున్నాడు. బహిరంగ మద్యం సేవించడమే నేరం. అలాంటి ప్రభుత్వ కార్యాలయంలో మద్యం సేవిస్తూ విధులు అంతకంటే నేరం. కానీ అవేమీ పట్టించుకోకుండా దర్జాగా బీరు తాగుతూ పని చేశాడు. 

ఓ పౌరుడు కార్యాలయానికి వచ్చిన సందర్భంలో ఈ వ్యవహారాన్ని తన ఫోన్ లో బంధించారు. దీంతో సురేష్ మద్యం సేవించే వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. దీంతో ఉన్నతాధికారులు సురేష్ ను మందలించినట్లు తెలిసింది. అయితే ఈ ఘటన మూడు రోజుల కింద జరిగినట్లు సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
Warangal Airport: జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు
జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Mancherial Latest News:
"అప్పుల ఊబిలో చిక్కుకొని అనాథలా సింగరేణి" భరోసా యాత్రలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget