అన్వేషించండి

RTC Driver Shankar Goud: వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్తత.. డిపో వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిపో వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లి నివాళి అర్పించాలని ప్రయత్నిస్తున్నారు.

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామం ఆర్టీసీ కార్మికుల ఆందోళనలతో దద్దరిల్లింది. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి, అక్కడ నివాళులర్పించాలని తోటి కార్మికులు పట్టుబట్టారు. తమ సహచర ఉద్యోగి త్యాగానికి గుర్తుగా డిపో సాక్షిగా నివాళి అర్పించడమే తమ లక్ష్యమంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ భారీగా మోహరించిన పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ నిరసనలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్మికులకు మద్దతుగా నిలిచారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు ఆయన ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఎలాగైనా డిపో వద్దకు తీసుకెళ్లేందకు అనుమతించాలని ఆయన కుటుంబసభ్యులు పోలీసుల కాళ్లావేళ్లా పడ్డ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు నిరసనలో పాల్గొన్న పెద్ది సుదర్శన్ రెడ్డిని శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. 

పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో ముత్తోజిపేటలో గందరగోళం నెలకొంది. శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మికులు నినాదాలు చేశారు. పోలీసులు బలవంతంగా నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, కార్మికుల పట్టుదలతో ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించారు. భూపాలపల్లిలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ముత్తోజిపేటలో పోలీసుల పహారా.. ప్రభుత్వంతో జేఏసీ చర్చలు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) భౌతికకాయం ఆయన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం ప్రకారం, నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు, శంకర్ గౌడ్ మృతితో నెలకొన్న విషాద పరిస్థితుల మధ్యే ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలకు వెళ్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ వెంకన్న ప్రకటించారు. శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కొందరు జేఏసీ నేతలు ముత్తోజిపేటకు వెళ్లారు. హైదరాబాద్‌లో సచివాలయం వేదికగా శుక్రవారం ఉదయం సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. తొలుత ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ కమిటీ సమావేశమై వారి డిమాండ్లపై చర్చిస్తుంది. ఈ చర్చల ఫలితం సమ్మె భవిష్యత్తును నిర్ణయించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget