అన్వేషించండి

Errabelli Pradeep Rao : టీఆర్ఎస్ కు భారీ షాక్, మంత్రి ఎర్రబెల్లి సోదరుడు రాజీనామా

Errabelli Pradeep Rao : టీఆర్ఎస్ పార్టీకి వరంగల్ లో బిగ్ షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Errabelli Pradeep Rao : వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.  వరంగల్ లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇకపై టీఆర్​ఎస్​ పార్టీలో కొనసాగనని తెలిపారు. పార్టీలో తనకు విలువలేదని అందుకనే రాజీనామా చేస్తున్నట్లుఎర్రబెల్లి ప్రదీప్​ రావు అన్నారు. వరంగల్ ను రూ.4 వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేసుంటే ప్రజలు నిజంగానే బ్రహ్మరథం పడతారని ఎమ్మెల్యే నరేందర్ ఉద్దేశించి విమర్శలు చేశారు. నరేందర్ కు దమ్ముంటే రాజీనామా చేయాలని ప్రదీర్ రావు సవాల్​ విసిరారు. వరంగల్ అభివృద్ధి ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఆయన సంస్కారహీనుడని మండిపడ్డారు. తనకు టికెట్ ఇస్తానని నమ్మించి మోసం చేశారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించారు. ఎమ్మెల్యే రాజీనామా చేసి వస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు. ఒకవేళ నరేందర్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. బతికున్నంత కాలం నరేందర్ కు మద్దతిస్తానని ఎర్రబెల్లి తెలిపారు.

ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులు 

ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అనుచరులు తనను వేధిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. తనను ఉద్దేశించి నరేందర్ అనుచరులు చాలా అసభ్యంగా మాట్లాడారన్నారని విమర్శించారు. రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో మద్దతు ఉంటే ఆ పార్టీలో జాయిన్ అవుతానన్నారు. లేదంటే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డానని, బంగారం తెలంగాణ సాధన కోసం అనేక త్యాగాలు చేసినట్లు ఎర్రబెల్లి చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో పనిచేసినట్టుగా ఆయన చెప్పారు. 

బీజేపీలోకి! 

వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడుగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్ఎస్ కు రాజీనామాచేశారు. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించారు. కానీ టికెట్ రాకపోవడంతో అప్పటి నుంచి ప్రదీప్ రావు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.  టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డానని ఎర్రబెల్లి అన్నారు. అన్నీ సహించి ఇన్నాళ్లూ పార్టీలో కొనసాగానని తెలిపారు. ప్రదీప్‌ రావు బీజేపీలో చేరడం ఖాయమని సమాచారం. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు తెలిసింది.  

"నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశాను. ఎమ్మెల్యే నరేందర్ అవమానపరిచేలా మాట్లాడారు. ఎమ్మెల్యే నన్ను అవమానకరంగా తిడుతున్నారు. ఆయన ఏం తిట్టినా టీఆర్ఎస్ నాయకులు దానిని ఖండించలేదు. ఏ పార్టీలో గౌరవం ఉంటే అక్కడి వెళ్తా లేదంటే ఇండిపెండెంట్ గా ఉంటాను. " -ఎర్రబెల్లి ప్రదీప్‌రావు 

Also Read : KTR-Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్‌ పవన్ కల్యాణ్ యాక్సెప్ట్, ‘రామ్‌ భాయ్‌ - కేటీఆర్ అన్నా’ అనుకుంటూ ఆప్యాయత

టాప్ హెడ్ లైన్స్

El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget