అన్వేషించండి

BJP Vs BRS :హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత, బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన

BJP Vs BRS : హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు నిరసన చేపట్టారు.

BJP Vs BRS :  హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు యూనివర్సిటీ ఫస్ట్ గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహ‌నం చేశారు. బీజేపీ ఫ్లెక్సీలను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్వీ నేతలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే హక్కు లేదని, నిరుద్యోగ మార్చ్ అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో 11 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ధ‌ర్మసాగ‌ర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాకతీయ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

బీజేపీ నిరుద్యోగ మార్చ్ 

టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై శనివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో హ‌న్మకొండ‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ ​ను బర్తరఫ్ ​చేయాలని, పేపర్ల లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలనే డిమాండ్లతో భారీ ర్యాలీ చేపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు సీనియర్ నాయకులు ఈ మార్చ్ కు హాజరుకానున్నారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్​ నుంచి నయీంనగర్, పెట్రోల్ పంప్, పోలీస్ ​హెడ్ ​క్వార్టర్స్ మీదుగా అంబేడ్కర్ జంక్షన్​ వరకు ర్యాలీ కొనసాగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయిన ఈ ర్యాలీ.. దాదాపు 2 కిలోమీటర్ల మేర సాగనుంది. కేటీఆర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని నిరుద్యోగ మార్చ్ లో బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 

దిల్లీలో నిరుద్యోగుల మార్చ్ నిర్వహించండి - మంత్రి తలసాని 

 ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన మోదీ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు నిలదీయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా తెలంగాణలో నిరుద్యోగుల మిలీనియం మార్చ్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే దిల్లీలో నిరుద్యోగుల మార్చ్‌ చేయాలని సవాల్ చేశారు. ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ తొమ్మిది ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు బీఆర్‌ అంబేడ్కర్ పేరును ఉపయోగించుకోవడం తప్ప సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసి నిజమైన గౌరవం కల్పించారని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం చేతకాని బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నాలుగేళ్లుగా ఎన్ని నిధులు తెచ్చారని మంత్రి తలసాని ప్రశ్నించారు.  

 

టాప్ హెడ్ లైన్స్

HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Telangana SIR Process Voter Deletions: తెలంగాణలో పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు - కాంగ్రెస్ నేతల వైఫల్యమేనా? హైకమాండ్ ఆగ్రహం ఎందుకు?
తెలంగాణలో పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు - కాంగ్రెస్ నేతల వైఫల్యమేనా? హైకమాండ్ ఆగ్రహం ఎందుకు?
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget