అన్వేషించండి

Telangana: టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన దసరా, ప్రత్యేకబస్సులతో భారీగా ఆదాయం

సొంతూళ్లకు వెళ్లే ప్రయాణఇకుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. స్పెషల్ బస్సుల ద్వారా రూ.25 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

దసరా పండుగ టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణఇకుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. స్పెషల్ బస్సుల ద్వారా రూ.25 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు దసరా సందర్బంగా 5,500 స్పెషల్ సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడిపింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో గతేడాదితో కంటే అదనంగా  1,302 ప్రత్యేక బస్సులను నడిపింది. పక్కా ప్రణాళికతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడిపించడంతో ఆర్టీసీ ఆదాయం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ ఉన్నాయి. ఒక్కో రీజియన్‌కు సరాసరిగా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లతో పాటు సీబీఎస్‌, దిల్‌షుక్‌నగర్‌, లింగంపల్లి, చందానగర్‌, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, టెలిఫోన్‌ భవన్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, ఎల్బీనగర్‌ల నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడిపింది. సోంతూళ్లకు వేళ్లే ప్రయాణికులపై భారం వేయకుండా సాధారణ చార్జీలను వసూలు చేసింది టీఎస్ఆర్టీసీ. అదనంగా 13వందల బస్సులు నడపటం, సాధారణ చార్జీలనే వసూలు చేయడంతో ప్రజలను ఆర్టీసీ బస్సుల్లోనే సోంతూళ్లకు వెళ్లి వచ్చారు. ఈ కారణంగా ఆర్టీసీకి గతేడాది కంటే 25 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. 

దసరా సందర్భంగా ఆర్టీసీ అక్టోబర్ 13 నుంచి 24 వరకు 11 రోజులపాటు ప్రత్యేక బస్సులను నడిపించింది. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఒకేసారి రావడంతో మెజార్టీ ప్రజలకు సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి రోజు ఆర్టీసీకి సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. అయితే పండుగ సందర్భంగా ప్రతిరోజూ అదనంగా రూ.3 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి గత 11 రోజుల్లో రూ.25 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరింది. దీనికి తోడు డైనమిక్ చార్జీలు కూడా కలిసి వచ్చాయి. ప్రయాణికులు తక్కువ ఉన్న సమయంలో తక్కువ ఛార్జీలు, రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కువ వసూలు చేయడమే డైనమిక్‌ చార్జీలు వసూలు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Revanth Reddy Governance Criticisms: రాజకీయాల్లో దూకుడు - పథకాల అమల్లో ఆలస్యం - రేవంత్ పాలనలో వెనుకబడుతున్నారా?
రాజకీయాల్లో దూకుడు - పథకాల అమల్లో ఆలస్యం - రేవంత్ పాలనలో వెనుకబడుతున్నారా?
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget