అన్వేషించండి

TSRTC News: త్వరలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు - దూర ప్రాంతాలకు కూడా: సజ్జనార్

వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను సజ్జనార్ తనిఖీ చేశారు.

సుదూర ప్రాంతాలకు త్వరలోనే ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా.. మొదటి సారిగా మిగతా రూట్లలో కూడా ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే 1860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చిన సంస్థ.. వాటిలో కొన్నింటిని డిసెంబర్ లో వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే హరియాణా పల్వాల్ లో జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణాన్ని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. 

వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ఆయన తనిఖీ చేశారు. టీఎస్ఆర్టీసీకి అందిస్తోన్న రెండు ప్రొటో(నమూనా) బస్సులను పరిశీలించారు. జేబీఎం గ్రూప్ హెడ్ సేల్స్(నార్త్) ముఖేశ్ శర్మ, జీఎం ఆపరేషన్స్ ప్రశాంత్ శర్మతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ  బస్సుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి టీఎస్ఆర్టీసీకి అందించాలని వారిని ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. 

“జేబీఎం గ్రూప్ 500 ఎలక్ట్రిక్ బస్సులను ఒప్పందం ప్రకారం టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది. వాటిని విడతల వారీగా ఆ కంపెనీ అందించనుంది. డిసెంబర్ లో కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యాధునిక హంగులతో ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తీసుకువస్తుంది.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. 

ఈ బస్సుల్లో ప్రయాణికులను లెక్కించే సదుపాయంతో పాటు భద్రతకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుందని, గమ్యస్థానాల వివరాల కోసం బస్సులో ఎల్ఈడీ బోర్డులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, సికింద్రాబాద్ డిప్యూటీ ఆర్ఎం భీమ్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్(ప్రాజెక్ట్స్) భాను ప్రసాద్, జేబీఎం గ్రూప్ ప్రతినిధులు నిఖిల్ ఓజా, అమిత్ వర్మ, మనోహర్ లాల్, తదితరులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget