అన్వేషించండి

Revanth Reddy: సెక్యూరిటీ ఇస్తారా? లేక కోర్టుకు వెళ్లమంటారా? - డీజీపీకి రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy: తన భద్రత విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదన్నారు.

Revanth Reddy: తన భద్రత విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు. హైకోర్టులో మాత్రం 69 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని పోలీసులు తప్పుడు వాదనలు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే భద్రత మాత్రం కల్పించడం లేదన్నారు. దీనికి తోడుగా గత జులైలో తనకు ఉన్న 2+2 భద్రతను సైతం వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు.

తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. తక్షణం తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. లేదంటే కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద కేసు వేస్తామంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా, గతంలో రేవంత్ రెడ్డి యాత్ర సందర్భంగా సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎంపీ రేవంత్‌కు సెక్యూరిటీ కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు.

పాదయాత్ర సమయంలో భద్రత కోరిన రేవంత్ రెడ్డి
భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు  కడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి కటౌట్‌ కట్టకుండా అడ్డుకోవడంతో అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త టవర్ ఎక్కాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. మొత్తానికి పోలీసులకు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో తనకు భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రకు భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ యాత్ర జరిగే ప్రాంతాల్లో  ఇప్పటికే భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపింది. పాదయాత్ర సందర్భంగా భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించినట్టు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) తెలిపారు. భద్రత కల్పించాలని ఆదేశించిన ఫ్యాక్స్ కాపీని కోర్టుకు సమర్పించారు. డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఇస్తున్నారో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.

విచారణ సందర్భంగా పాదయాత్రలో రేవంత్ రెడ్డి చుట్టూ 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం పాదయాత్రకు భద్రత కల్పిస్తే విచారణ కొనసాగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్న భద్రత ఉందో? లేదో? కోర్టుకు తెలపాలని రేవంత్‌ తరఫు న్యాయవాదికి సూచించింది. దీనిపై రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ ఆ భద్రత కేవలం యాత్ర, బందోబస్తు, ట్రాఫిక్ కోసమే ఇస్తున్నారని వివరించారు. దీంతో నైట్ హాల్ట్ లోనూ సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రకు పూర్తి భద్రక కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నర్సింగ్ విద్యార్థినుల భద్రతపై మణిపూర్ మహిళా కమిషన్‌‌కు ఏపీ ప్రభుత్వం భరోసా
నర్సింగ్ విద్యార్థినుల భద్రతపై మణిపూర్ మహిళా కమిషన్‌‌కు ఏపీ ప్రభుత్వం భరోసా
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Embed widget