అన్వేషించండి

TS Weather: ఈ ప్రాంతాలను తెలంగాణ కశ్మీర్‌ అనొచ్చు- సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణ మొత్తం చలికి వణికిపోతోంది. చలిగాలుల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. ఏజెన్సీల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. మరో మూడు రోజులు చలి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Cold waves in Telangana: హూ.. గజ... గజ... తెలంగాణలో రాత్రి అయితే చాలు... కాదు కాదు సాయంత్రం అయితే చాలు.. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. ఇళ్లలో ఉన్నవారు  కూడా చలికి వణికిపోతున్నారు. ఇక... బయట తిరిగి వారి పరిస్థితి.. మాటల్లో చెప్పలేం. చలిని తట్టుకునేందుకు స్వెట్టర్లు వేసుకున్నా సరే... గజగజా వణకాల్సి వస్తోంది.  చలిగాలులకు స్వెట్టర్లు కూడా ఆగడంలేదు. సాయంత్రం అవుతూనే చలిగాలులు మొదలవుతున్నాయి.. ఆరు గంటల దాటిన తర్వాత వణుకు మొదలవుతుంది. ఇంట్లో ఉంటేనే చలిని తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. ఇక.. బయట తిరిగేవారి పరిస్థితి అయితే.. ఏ శీతల మండలంలోనో ఉన్నట్టు అనిపిస్తోంది. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి  మరీ విపరీతంగా ఉంది. 

తెలంగాణలో రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో.. చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్రంలో  19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల వరకు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో  అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లోని జైనథ్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. హైదరాబాద్‌లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్‌ అయ్యింది. అంటే.. చలిగాలుల  తీవ్రత ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలిగాలులకు... ప్రజలు వణికపోతున్నారు. అంతేకాదు... ఇంకొన్నిరోజులు ఇదే  పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుండటంతో... భయపడిపోతున్నారు. ఈ చలిని తట్టుకోవడం మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ.... దుప్పట్లు, రగ్గులు.. కప్పుకుని  ఇళ్లకే పరిమితమవుతున్నారు. వృద్ధుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇక చిన్నపిల్లలు అయితే... జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతున్నారు. 

ఉదయం, సాయంత్రం వేళల్లో పొగ మంచు ఉండటం వల్ల ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సైతం ఉదయం చలికి  తట్టుకోలేక పోతున్నారు. తెల్లవారుతూనే పనులు మొదలుపెట్టే పాల వ్యాపారులు, పేపర్‌ బాయ్‌ కూడా చలితో వణికిపోతున్నారు. సాయంత్రం అయ్యిందటే చాలు.. చలిని  తట్టుకునేందుకు పలు కాలనీల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. 

ఉత్తర తెలంగాణలోనే చలి తీవ్రత అధికంగా ఉందని అధికారులు చెప్తున్నారు. అక్కడ అన్ని జిల్లాల్లో అల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల్లో చలి తీవ్రత  అలాగే ఉంటుందని... పైగా ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోతాయని చెప్తున్నారు. దీంతో చలి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల  కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో... పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగిన  జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit 2026: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం.. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అతిదేబ్ సర్కార్
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం.. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అతిదేబ్ సర్కార్
ABP Southern Rising Summit 2026 LIVE: హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. పాల్గొననున్న రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు
హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. పాల్గొననున్న రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
ABP Southern Rising Summit: దేశాభివృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర: నేడు హైదరాబాద్ వేదికగా ఏబీపీ 'సదరన్ రైజింగ్ సమ్మిట్'
హైదరాబాద్ వేదికగా ABP సదరన్ రైజింగ్ సమ్మిట్, షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌.. ఎక్కడ చూడాలంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget