అన్వేషించండి

TSRTC Charges Hike : సామాన్యుడికి షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ, మరోసారి ఛార్జీల మోత!

TSRTC Charges Hike : ఆర్టీసీ ప్రయాణికులకు ఛార్జీల మోత మోగింది. డీజిల్ సేస్ పేరుతో ఆర్టీసీ మరోసారి ఛార్జీలు పెంచేందుకు నిర్ణయించింది. రేపటి నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

TSRTC Charges Hike : టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు షాకిచ్చింది. మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను పెంచింది. ఈ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. డీజిల్ ధర పెంపు కారణంగా ఆర్టీసీ డీజిల్ సెస్ విధించింది. పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ బస్సుల్లో టికెట్‌పై రూ. 2 చొప్పున అదనంగా సెస్ వసూలు చేస్తారు. ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, ఎయిర్ కండిషన్ బస్సుల్లో అదనంగా రూ. 5 వసూలు చేయనున్నారు. డీజిల్ బల్క్ గా కొనుగోలు చేస్తే రూ. 118కు చేరిందని, ఒక్కో లీటర్‌పై రూ. 35 చొప్పున పెరగడం సంస్థపై భారం పడుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు పెరుగుతుండడంతో డీజిల్ సెస్ తప్పడం లేదన్నారు. 

పెరిగిన బస్ పాస్ ఛార్జీలు

ఇటీవల అన్ని రకాల బస్‌ పాస్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పెంచింది. పెంచిన ధరలను ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్డినరీ పాస్‌ ఛార్జీని రూ.950 నుంచి రూ.1150కి పెంచింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కు పెంచింది. మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎన్‌జీవో బస్‌పాస్‌లకు ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు పెంచింది. ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సెఫ్టీ సెస్ పేరుతో అదనపు వసూళ్లు 
 
పల్లెవెలుగు, ఇతర కేటగిరీల బస్సుల్లో చిల్లర సమస్య కారణంగా రౌండప్ పేరుతో ఛార్జీల సవరణ చేసి కొంత మేర అదనపు ఛార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ సేఫ్టీ సెస్‌ పేరుతో బస్ టికెట్‌పై రూపాయి పెంచింది. చిల్లర సమస్య రాకుండా చేయడంతో టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది. ఇప్పుడు డీజిల్ సెస్ పేరుతో మరో రూపంలో వసూలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. రోజుకు సగటున ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఆర్టీసీ వివిధ రకాల బస్సు సర్వీసుల్లో సెస్ పేరుతో అదనపు ఆదాయాన్ని పొందనుది. డీజిల్ ధరల పెరగడంతో సరుకు రవాణా ఛార్జీలు పెంచింది. వేసవిలో ఏసీ బస్సులో ప్రయాణించాలని అనుకునే వారు అదనంగా చెల్లించాల్సిందే. సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget