అన్వేషించండి

TS Power Demand : తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు, ఒక్క రోజులో 14 వేల మెగావాట్లకు పైగా వినియోగం!

TS Power Demand : తెలంగాణలో చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ మంగళవారం నమోదు అయింది. గత ఏడాది రికార్డులు బద్దలు కొడుతూ 14 వేలకు పైగా మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

TS Power Demand : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్(Electricity Demand) 14,117 మెగావాట్లు‌ మంగళవారం నమోదు అయింది. ఇవాళ సాయంత్రానికి ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అత్యధిక విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లు మాత్రమే ఉండేది. సౌత్ ఇండియా(South India)లో అత్యధిక విద్యుత్ వినియోగంలో తెలంగాణ(Telanagana)ది రెండో స్థానం నిలుస్తోంది. మొదటి స్థానంలో తమిళనాడు(Tamil Nadu) ఉంది.  తెలంగాణలో విద్యుత్ వాడకంలో రికార్డులు తిరగరాస్తుంది. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగంలో పీక్ డిమాండ్ వస్తుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద విద్యుత్ వినియోగం పెరుగుతుండడం, మార్చి నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అధికమైనట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. వాణిజ్య, గృహ విద్యుత్(Domestic Power Usage) వినియోగం భారీగా పెరుగుతుందని, అయినా ఎక్కడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. 

గత ఏడాడి రికార్డు బద్దలు 

మార్చి నెలలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు(High Temperatures) నమోదు అవుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మార్చి నెలలోనే అత్యధికంగా మంగళవారం మధ్యాహ్నానికి 14,117 మెగావాట్ల విద్యుత్ వాడకం రికార్డు అయింది. గత ఏడాది మార్చి 31న 13,688 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు కాగ, ఈ సంవత్సరం రికార్డు తిరగరాస్తూ ఏకంగా 14,117 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యింది. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలో భారీగా విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ అధికారులు తెలిపారు. గత ఏడాది హైదరాబాద్ లో 55 మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం కాగా ఈ ఏడాది మార్చిలోనే 65 మిలియన్ యూనిట్లు డిమాండ్ వచ్చిందని తెలిపారు.  

15 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చిన పర్లేదు 

మార్చిలోనే విద్యుత్ వినియోగం పీక్ దశలో ఉంటే ఏప్రిల్, మే మొదటి వారంలోనే 15 వేల మెగావాట్ల చేరువలో పీక్ డిమాండ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 15 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చిన విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో 11.34 శాతం వృద్ధి నమోదు అయింది. ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం నమోదు అయితే తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధిరేటు సాధించి రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2017-18 తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,727 యూనిట్లు ఉండగా, 2018-19 నాటికి 1,896 యూనిట్లు చేరింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఫుడ్ కల్తీపై రేవంత్ సీరియస్- ఈగల్‌, హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు రెడీ! కేసీఆర్‌ను హౌస్ అరెస్టు చేశారని విమర్శ!
ఫుడ్ కల్తీపై రేవంత్ సీరియస్- ఈగల్‌, హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు రెడీ! కేసీఆర్‌ను హౌస్ అరెస్టు చేశారని విమర్శ!
Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
US Iran War: అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Hardik Pandya Luxury Car: హార్దిక్ పాండ్యా లగ్జరీ కార్ల కలెక్షన్ , ఇండియాలోనే ఫస్ట్ ఓనర్‌గా రికార్డు!
హార్దిక్ పాండ్యా లగ్జరీ కార్ల కలెక్షన్ , ఇండియాలోనే ఫస్ట్ ఓనర్‌గా రికార్డు!
CSK vs RR: చెన్నై కష్టాలను పెంచగల రాజస్థాన్ ఆటగాళ్లు వీరే.. లిస్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
చెన్నై కష్టాలను పెంచగల రాజస్థాన్ ఆటగాళ్లు వీరే.. లిస్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Embed widget