అన్వేషించండి

CPM Third List: జోరు పెంచిన సీపీఎం, మూడో జాబితా విడుదల

CPM Third List: తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది సీపీఎం పార్టీ జోరు పెంచింది. కొత్తగా మరో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

CPM Third List: తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది సీపీఎం పార్టీ జోరు పెంచింది. కొత్తగా మరో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ తమ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా, ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను ఇప్పటికే సీపీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆదివారం ఉదయం 14 మందితో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తొలి జాబితా విడుదల చేశారు. సోమవారం ఉదయం ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మల్లు లక్ష్మి, నల్గొండ నియోజకవర్గం నుంచి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. మంగళవారం సాయంత్రం ముగ్గురి పేర్లు వెల్లడిస్తూ మూడో జాబితాను సీపీఎం విడుదల చేసింది. సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ మేనిఫెస్టోను సైతం ప్రకటించారు. పొత్తులపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుని సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని, అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని పేర్కొన్నారు. 

ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేస్తే ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తమ్మినేని తెలిపారు.  కాంగ్రెస్​ నేతల వైఖరి, తమను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వని కాంగ్రెస్‌ తో పొత్తు ఉండదని తమ్మినేని తేల్చి చెప్పారు.

అభ్యర్థులు వీరే

  • భద్రాచలం (ఎస్టీ) - కారం పుల్లయ్య
  • అశ్వారాపుపేట (ఎస్టీ) - పిట్టల అర్జున్
  • పాలేరు - తమ్మినేని వీరభద్రం
  • మధిర (ఎస్సీ) - పాలడుగు భాస్కర్
  • వైరా (ఎస్టీ) - భూక్యా వీరభద్రం
  • ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్
  • సత్తుపల్లి (ఎస్సీ) - మాచర్ల భారతి
  • మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి
  • నకిరేకల్ (ఎస్సీ) - చినవెంకులు
  • భువనగిరి - కొండమడుగు నర్సింహ
  • జనగాం - మోకు కనకారెడ్డి
  • ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య
  • పటాన్ చెరు - జె.మల్లికార్జున్
  • ముషీరాబాద్ - ఎం.దశరథ్
  • హుజూర్‌నగర్‌ - మల్లు లక్ష్మి
  • నల్గొండ - ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
  • కోదాడ - మట్టిపల్లి సైదులు
  • మునుగోడు - దోనూరు నర్సిరెడ్డి
  • ఇల్లందు - దుగ్గి కృష్ణ

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget