అన్వేషించండి

Paddy Procurement: నేటి నుంచి తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు - టార్గెట్ ఎంతో తెలుసా?

Paaddy Procurement in Telanganaధాన్యం కొనుగోలుపై అడిషనల్‌ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారులతో బుధవారం మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు.

Paddy Procurement From Today In Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని నేటి నుంచి కొనుగోలు చేయనున్నారు. దీంతో నేటి నుంచి రైతులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లైన్ కట్టారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై అడిషనల్‌ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారులతో బుధవారం మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ముందుగా పంట చేతికొస్తున్న ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పారు. మే మొదటి వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయని, జూన్‌ మొదటివారంలోగా కొనుగోలు పూర్తిచేస్తామని చెప్పారు. 

లక్ష్యం ఎంతంటే..
ఈ యాసంగిలో రాష్ట్రంలో 36 లక్షల ఎకరాల్లో వరి సాగు అవ్వగా.. 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ర్టాల ధాన్యం తెలంగాణలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో 51 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు.

డబ్బులు 3 రోజుల్లోనే..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో కేవలం 3 రోజుల్లోనే డబ్బు జమ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోలుకు రూ.16 వేల కోట్లు అవసరం అవుతుందని, ఈ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 

కొనుగోలు కేంద్రానికి రైతు తాను ధాన్యాన్ని తీసుకెళ్లినప్పుడు అతని ఆధార్‌ నంబరు ఆధారంగా ఆ రైతు ఎన్ని ఎకరాల్లో వరి వేశాడు? ఎంత దిగుబడి వస్తుందనే వివరాలన్నీ వచ్చేలా ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు ఫోన్‌కు ఓటీపీ వెళ్లిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేస్తారని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులందరూ ఒక్కసారే రాకుండా టోకెన్ల పద్ధతిని అమలు చేయనున్నట్టు తెలిపారు.

ఈ సీజన్‌లో లక్ష్యంగా పెట్టుకున్న 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం 1.6 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 8 కోట్ల గోనె సంచుల సేకరణకు 25న టెండర్లు పిలవనున్నారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 236 కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటుచేశారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Dandari Festival: ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో దీపావళి వేళ వరుస అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణనష్టం
హైదరాబాద్‌లో దీపావళి వేళ వరుస అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణనష్టం..
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Adilabad Dandari Festival: ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Embed widget