అన్వేషించండి

Land Minimum Price: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూముల విలవ పెరగడం ఇదే తొలిసారి. కొత్త జిల్లాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల వలన భూముల రేట్లు పెరిగాయన్న ప్రభుత్వం…అన్ని కసరత్తులు చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామంది.

 

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలు పెరిగాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలను మూడు విభాగాలుగా పెంచింది. లోయర్‌ రేంజ్‌ మార్కెట్‌ విలువలున్న ఆస్తులపై 50 శాతం, మిడ్‌ రేంజ్‌ లో ఉన్న విలువలపై 40 శాతం, హయ్యర్‌ రేంజ్‌లో ఉన్న విలువలపై 30 శాతం చొప్పున పెంచింది. వీటితో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. పెరిగిన మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి. 22న…ఆ తర్వాత తేదీల్లో రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే బుక్‌ చేసుకున్న స్లాట్లకు కూడా కొత్త విలువలే వర్తింపచేసింది ప్రభుత్వం. ఇందుకోసం ‘ధరణి’ పోర్టల్‌లో ‘అడిషనల్‌ పేమెంట్స్‌ ఫర్‌ స్లాట్స్‌ ఆల్‌రెడీ బుక్డ్‌’ పేరుమీద పెట్టిన కొత్త విభాగంలో అదనపు ఛార్జీల వివరాలు పొందుపర్చారు.


Land Minimum Price: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి…

మూడొంతులు పెరిగిన వ్యవసాయ భూముల ధరలు

వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరానికి ఇప్పటి వరకు కనీస మార్కెట్‌ విలువ 10 నుంచి 25 వేల వరకు ఉండగా.. దీన్ని 75 వేలకు పెంచింది. ప్రస్తుతం ఎకరానికి తక్కువ స్థాయిలో ఉన్న మార్కెట్‌ విలువలపై 50 శాతాన్ని పెంచింది. మధ్య స్థాయిలో ఉన్న విలువపై 40 శాతం, అత్యధికంగా ఉన్న విలువపై 30 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు సమీపంలో వ్యవసాయ భూములపై 30 శాతం మేర, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ భూములపై 50 శాతం మేర, ఓ మోస్తరు పట్టణాలకు దగ్గరగా ఉండే భూములపై 40 శాతం మేర విలువలు పెరిగాయి. 


Land Minimum Price: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి…

ఓపెన్ ప్లాట్ల  మార్కెట్ విలువ ఎంత పెరిగిందంటే…

వ్యవసాయేతర ఆస్తుల కిందకు వచ్చే ఓపెన్‌ ప్లాట్ల మార్కెట్‌ విలువలను మూడు కేటగిరీలుగా.. అపార్ట్‌మెంట్లు, వాటిలోని ఫ్లాట్ల మార్కెట్‌ విలువలను రెండు కేటగిరీలుగా పెంచారు. ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస విలువ ప్రస్తుతం 100గా ఉంది. ఇప్పుడు దీన్ని డబుల్ చేసేశారు. ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించి తక్కువస్థాయిపై 50శాతం, మధ్యస్థాయిపై 40శాతం, అధికస్థాయిపై 30శాతం చొప్పున విలువలను పెంచింది. అపార్ట్‌మెంట్లు, వాటిలోని ఫ్లాట్ల కనీస మార్కెట్‌ విలువను చదరపు అడుగుకు 800 నుంచి 1000కి పెంచింది. తక్కువ స్థాయిపై 20 శాతం, ఎక్కువ స్థాయిపై 30 శాతం మేర మార్కెట్‌ విలువలు పెంచింది. 


Land Minimum Price: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి…

ఆచి తూచి అడుగేసిన టీ సర్కార్

మార్కెట్‌ విలువలు సుదీర్ఘ కాలం తర్వాత పెంచినప్పటికీ భారీ స్థాయిలో బాదుడు లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందనే చెప్పాలి. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో భూముల కొనుగోళ్లపై దృష్టి సారించాయి. దేశంలోని ఏ నగరంలో లేనంతగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయులో మార్కెట్‌ విలువలను పెంచితే రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రభావం పడుతుందని యోచించింది. మార్కెట్‌ విలువలను చివరిసారిగా 2013లో సవరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విలువలను పెంచడానికి సాహసించలేదు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయ వనరులు తగ్గిపోవడంతో సర్కారు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచాలని నిర్ణయించింది. జూన్ 13న జరిగిన కేబినెట్‌ భేటీలోనే పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.


Land Minimum Price: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి…

రెండు రోజుల ముందే సర్వర్లు డౌన్

భూముల మార్కెట్‌ విలువల పెంచుతున్నట్లు ప్రకటించడానికి ముందుగానే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. జూన్ 20 సాయంత్రం 5 గంటలకల్లా రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలంటూ సబ్‌ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు మెసేజ్ లు పంపించారు. దీంతో సర్వర్ డౌన్ అయింది. జూన్ 20 మధ్యాహ్నం 3.30 గంటల సమయంలోనే సబ్‌ రిజిస్ట్రార్లకు మెసేజ్‌లు పంపించడంతో పలు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కార్డ్ సర్వర్ ను నిలిపేశారు. వాస్తవానికి భూముల మార్కెట్ విలువలు పెరుగుతాయన్న సమాచారం మేరకు జూన్ రెండో వారం నుంచే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి. రాత్రి 7, 8 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది.

టాప్ హెడ్ లైన్స్

Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget