అన్వేషించండి

Telangana Dial 112 Launch : డయల్ 100 స్థానంలో ఇక డయల్ 112 - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీతో తెలంగాణ పోలీసింగ్‌లో సరికొత్త విప్లవం!

Dial 112: తెలంగాణలో డయల్ 100 స్థానంలో డయల్ 112 సేవలు ప్రారంభమయ్యాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏఐ, డ్రోన్ టెక్నాలజీతో డయల్ 112 వర్షన్ 3.0ను డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు.

Dial 112 Replaces Dial 100 Telangana:  తెలంగాణ శాంతిభద్రతల రక్షణ ,  అత్యవసర స్పందన వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ  డయల్ 112 సేవలను రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న సంప్రదాయ డయల్ 100 స్థానంలో  వన్ నేషన్.. వన్ ఎమర్జెన్సీ నంబర్ ప్రాతిపదికన ఈ ఏకీకృత వ్యవస్థను రూపొందించారు. బంజాన్ హిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్-B లో ప్రత్యేకంగా రెండు ఫ్లోర్ లను కేవలం డయల్ 112 కార్యకలాపాల కోసమే కేటాయించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆపదలో ఉన్న పౌరుల నుంచి డయల్ 112కి కాల్ రాగానే, ఆ అత్యవసర పిలుపును పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదని ఆయన సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అత్యవసర సేవల పరిణామ క్రమాన్ని ప్రస్తావిస్తూ, 2013లో జీవీకే  సంస్థ భాగస్వామ్యంతో డయల్ 100 సేవలు ప్రారంభమయ్యాయని డీజీపీ సీవీ ఆనంద్ గుర్తుచేశారు. విభిన్న రకాల అత్యవసర అవసరాలకు వేర్వేరు నంబర్లు కాకుండా, దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే ఏకీకృత ఎమర్జెన్సీ నంబర్ ఉండాలని గతంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయాన్ని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సాంకేతిక అభివృద్ధిని నిరంతరం విస్తరిస్తూ వచ్చామని, అందులో భాగంగానే డయల్ 100ను ఇప్పుడు అత్యంత పటిష్టమైన డయల్ 112గా అప్‌గ్రేడ్ చేశామని స్పష్టం చేశారు.

నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సాంకేతికత అందుబాటులోకి రావడంతో అత్యవసర సేవల నిర్వహణలో అనేక విధులు ఎంతో సులువయ్యాయని ఐపీఎస్ అధికారి తెలిపారు. బాధితులు డయల్ 112కి కాల్ చేయగానే వారి కచ్చితమైన లొకేషన్‌ను తక్షణమే ట్రేస్ చేయడానికి అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్  ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కేవలం నేరాల నివారణకే కాకుండా న్యాయ సాయం, వైద్య అత్యవసరాలు, ఫైర్, అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల బాధితులకు సైబర్ సాయం అందిస్తూ.. అన్ని రకాల సమస్యల పరిష్కారానికి డయల్ 112ను ఏకైక పరిష్కార మార్గంగా తీర్చిదిద్దామని ప్రకటించారు.

పోలీసింగ్ వ్యవస్థను నవతరం సాంకేతికతతో అనుసంధానించే క్రమంలో తెలంగాణ పోలీసులు త్వరలోనే డ్రోన్ ఆధారిత సాంకేతిక వ్యవస్థను   రంగంలోకి దించుతున్నారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేందుకు ప్రత్యేకంగా  డ్రోన్ టీమ్ ను సైతం రూ పొందించబోతున్నట్లు డీజీపీ వెల్లడించారు. సాంప్రదాయ బేసిక్ పోలిసింగ్‌తో పాటు సాంకేతిక రక్షణను సమాంతరంగా తీసుకెళ్లేలా  టెక్నాలజీ పోలిసింగ్  కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ డయల్ 112 అనేది కేవలం ఒక హెల్ప్‌లైన్ నంబర్ మార్పు మాత్రమే కాదని, ఇది అత్యవసర సేవల రంగంలో అడుగుపెట్టిన అడ్వాన్స్‌డ్ వర్షన్ 3.0 ' అని డీజీపీ సీవీ ఆనంద్ అభివర్ణించారు. ఈ నూతన డిజిటల్ సిస్టమ్‌ను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా ప్రజలకు అందించేందుకు ఏఐ టెక్నాలజీపై పట్టు ఉన్న యువ ఐపీఎస్ అధికారులను, టెక్-సావీ సిబ్బందిని ఇందులో ప్రత్యక్షంగా భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించారు. అత్యవసర సమయంలో పౌరులకు క్షణాల్లో రక్షణ కల్పించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఉద్ఘాటించారు.      

టాప్ హెడ్ లైన్స్

Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
CM Revanth Reddy: 34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Vrushakarma Songs : సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్
సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్
CM Revanth Reddy Birthday: కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget