కాంగ్రెస్ అధిష్ఠానం సెప్టెంబర్ నెలాఖరు నాటికి సుమారు 50 కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులను భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోంది.
Telangana Nominated Posts: ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవుల భర్తీ! గేమ్ ఛేంజర్‌గా మారనున్న కులగణన జాబితా !
తెలంగాణ కాంగ్రెస్ 50 నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తోంది. పార్టీ కోసం కష్టపడేవారికే ప్రాధాన్యం ఇస్తూ, కులగణన జనాభా ప్రకారం పోస్టుల భర్తీకి అధిష్ఠానం నిర్ణయించింది.

- తెలంగాణలో ఖాళీ నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు.
- సెప్టెంబర్ నాటికి 50 పదవులు, సామాజిక న్యాయానికి పెద్దపీట.
- పార్టీ కోసం నిజంగా శ్రమించిన వారికే పదవులు ఇవ్వాలని నిర్ణయం.
హైదరాబాద్: తెలంగాణలో ఏడాదిపాటు కేబినెట్ విస్తరణ అంశం హాట్ టాపిక్‌గా ఉండేది. ఈ క్రమంలో మహమ్మద్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలను కొన్ని నెలల కిందట మంత్రి పదవులు వరించాయి. అయినా మరో ముగ్గురికి కేబినెట్ బెర్త్ ఇవ్వడానికి అవకాశం ఉండటంతో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తెరపైకి వచ్చింది.
త్వరలోనే జాబితా సిద్ధం
తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి సుమారు 50 కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ మేరకు సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాను సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపనున్నారు. వారి నుంచి ఆమోదం లభిస్తే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిసిందే.
ఇదివరకే ముగిసిన పదవీకాలం.. చిగురిస్తున్న ఆశలు
2024 జులైలో రెండేళ్ల పదవీకాలంతో నియమితులైన పలువురు నేతల పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగియగా, మరికొందరికి అవకాశాలు కల్పించారు. అయితే పదవులు పొందిన కొందరు నాయకులు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని పీసీసీ అంతర్గత సమీక్షలో అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి మళ్లీ అవకాశం ఇవ్వకూడదని, పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల మధ్య ఉంటున్న నేతలకు ఛాన్స్ ఇచ్చేందుకు పీసీసీ, ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మరోసారి తమకే ఛాన్స్ ఇవ్వాలని ఆ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ పార్టీ కోసం శ్రమించే వారికే పదవులు ఇవ్వాలని భావిస్తోంది.
సామాజిక న్యాయం, కులగణన జాబితా ఆధారంగా పోస్టులు
నామినేటెడ్ పదవుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుతో తమ జనాభా నిష్పత్తికి అనుగుణంగా పదవులు కేటాయించాలని మాదిగ సామాజికవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ కులగణన నివేదికల ఆధారంగా గతంలో పెద్దగా ప్రాతినిధ్యం దక్కని కులాలకు ప్రాధాన్యమివ్వనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించిన నేతల జాబితాలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల నుంచి తెప్పించుకుని వారికి అవకాశం కల్పిస్తామని పీసీసీ వర్గాలు తెలిపాయి. కాగా, జులైలో పదవీకాలం పూర్తయిన నిర్మలా జగ్గారెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, శివసేనారెడ్డి, మెట్టు సాయికుమార్, ఈరవత్రి అనిల్, బెల్లయ్య నాయక్, ప్రీతం, మల్రెడ్డి రాంరెడ్డి, నూతి శ్రీకాంత్ వంటి వారికి మరోసారి అవకాశం ఇవ్వడంపై ప్రతిపాదనలు ఉన్నాయి. శివసేనారెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ రాకపోతే కనుక తిరిగి నామినేటెడ్ పదవి కన్ఫామ్ అని పార్టీలో వినిపిస్తోంది. పలువురు నాయకులు తొలిసారి పదవులు దక్కించుకోనున్నారు.
Frequently Asked Questions
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు పూర్తవుతుంది?
నామినేటెడ్ పదవుల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది?
ఏఐసీసీ మార్గదర్శకాల ప్రకారం సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పార్టీ కోసం శ్రమించిన వారికే పదవులు ఇవ్వాలని పీసీసీ భావిస్తోంది.
గతంలో నామినేటెడ్ పదవులు పొంది, మళ్లీ అవకాశం కోసం చూస్తున్న నాయకులు ఎవరు?
నిర్మలా జగ్గారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, శివసేనారెడ్డి, మెట్టు సాయికుమార్, ఈరవత్రి అనిల్, బెల్లయ్య నాయక్, మల్ రెడ్డి రాంరెడ్డి, నూతి శ్రీకాంత్ వంటి వారికి మరోసారి అవకాశం ఇవ్వడంపై ప్రతిపాదనలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు























