అన్వేషించండి

CM Revanth Reddy: 'మళ్లీ నేనే సీఎం, కేసీఆర్ ఎలా వస్తారో చూస్తా' - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana News: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.

CM Revanth Reddy Gave Appointment Letters: రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరూ అధైర్య పడొద్దని.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భరోసా ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించారు. తెలంగాణ (Telangana) కోసం పోరాడిన యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 'సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో.. ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తున్నాం. గత ప్రభుత్వానికి తొమ్మిదన్నరేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచనే రాలేదు. అధికారులతో సమీక్షించి ఉద్యోగాల భర్తీకి అన్నీ ఆటంకాలు తొలగించాం.' అని పేర్కొన్నారు.

'పదేళ్లు నేనే సీఎం'

నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. పదేళ్లు ఈ బాధ్యతలోనే ఉండి మీ కోసం 24 గంటలు కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'తెలంగాణను కబళించడానికి గంజాయి ముఠాలు తిరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. నిరుద్యోగ యువకులారా ఈ రాష్ట్రం మీదే. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న మీరు, మీకోసం పని చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. కేసీఆర్ మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఎలా వస్తారో నేనూ చూస్తా.' అని సవాల్ విసిరారు.

'2 లక్షల ఉద్యోగాలిస్తాం'

గత బీఆర్ఎస్ హయాంలో ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే 22 నెలలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ.. ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. 'TSPSC ప్రక్షాళన చేశాం. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. బీఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది.' అని పేర్కొన్నారు.

'గాడిదను పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారు'

నల్గొండ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చె బర్రెను ఇంటికి పంపి.. దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ అన్నారని.. అయితే, కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని  ఇవాళ అసెంబ్లీలో ఓ అటెండర్ తనకు చెప్పినట్లు సీఎం తెలిపారు. 'స్వరాష్ట్రం వచ్చాక బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారు. అయితే, కేసీఆర్ పాలనలో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఉద్యోగాల భర్తీపై అధికారులతో సమీక్షించి అన్ని ఆటంకాలు తొలగించాం. నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా? అని హరీష్ రావు అంటున్నారు. ఉద్యోగాలు పొందిన మీ కళ్లలో ఆనందం చూస్తేనే నాకు నిద్ర పడుతుంది. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటాం. కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులు, ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్ర యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదు. శాసనసభకు రమ్మంటే ఆయన రాలేదు. నల్గొండ వెళ్లి బీరాలు పలికారు. కృష్ణాలో నీటి వాటాలపై సీఎంగా కేసీఆర్ పెట్టిన సంతకాలు తెలంగాణ ప్రజల మరణ శాసనాలు. అవి మన పాలిట గుదిబండగా మారాయి. మళ్లీ నీళ్ల అంశాన్నే ఎత్తుకుంటున్నారు. ఢిల్లీతో కొట్లాడుదామంటే కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావట్లేదు. మేడిగడ్డ మేడిపండు చందంగా మారింది. పొట్ట విప్పితే అన్నీ పురుగులే ఉన్నాయి.' అంటూ రేవంత్ మండిపడ్డారు.

Also Read: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు - ఏఐసీసీ కీలక ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Dasara Festival Rush: పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget