అన్వేషించండి

BJP On Padayatra Attack : బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు, బీజేపీ నేతలు ఫైర్

BJP On Padayatra Attack : ప్రశాంతంగా జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తు్న్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్ లోనే దాడులు జరుగుతున్నాయన్నారు.

BJP On Padayatra Attack : ప్రశాంతంగా కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ నేతలు దాడులు హేయమని ఎంపీ సోయం బాపూరావు అన్నారు.  ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఈ యాత్రతో టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందన్నారు. అక్కసుతో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని కొంతమంది చిల్లరగాళ్లకు మందు తాగించి పంపిస్తున్నారని ఆరోపించారు. కొందరు చెంచాగాళ్లు, కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే నాయకులు అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని సోయం బాపూరావు ఘాటుగా స్పందించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని బండి సంజయ్ ముందే పసిగట్టారన్నారు. 

ఓపికను చేతగానితనంగా భావించొద్దు 

బీజేపీ కార్యకర్తలు తిరగబడితే టీఆర్ఎస్ ఉండదని ఎంపీ సోయం బాపూరావు అన్నారు.  ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసాలను బయటపెట్టడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారన్నారు. అందుకే బీజేపీ సంయమనంతో ఉందన్నారు. బీజేపీ నేతల ఓపికను చేతగానితనంగా భావించొద్దని హెచ్చరిస్తున్నా అన్నారు. చిల్లర చేష్టలతో బీజేపీని ఏమీ చేయలేరన్నారు. 

బండి పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర : రాజా సింగ్ 

బండి సంజయ్ పాదయాత్రపై దాడిని బీజేపీ శాసనసభా పక్షనేత రాజా సింగ్ ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్భలంతోపాటు మంత్రి కేటీఆర్ డైరెక్షన్ ప్రకారమే ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై దాడులు జరుగుతున్నాయన్నారు. పాదయాత్ర మొదలు పెట్టకముందే ఎంపీ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, దాడులు చేస్తారని చెప్పారన్నారు. బీజేపీ నేతలు సంయమనంతో ఉండాలని చెప్పారన్నారు.  ఈరోజు జరిగిన దాడిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలకు భరోసా కలిగిస్తుంటే పూర్తి భద్రత కల్పించాల్సింది పోయి ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేటు అన్నారు. 

పోలీసులు కుట్రలో ఇరుక్కోవద్దు 

అన్ని రంగాల్లో విఫలమైన సీఎం కేసీఆర్ ప్రజాగ్రహాన్ని ఎదుర్కోలేక దాడి చేయించారని రాజా సింగ్ విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడికి రక్షణ కల్పించలేని వాళ్లు సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారనే దానికి ఈ సంఘటన నిదర్శనమన్నారు.  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్షం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సాఫీగా కొనసాగేందుకు పూర్తి భద్రత కల్పించాలన్నారు.  మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.  రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి.. పోతుంటాయి.. పోలీసులు చట్ట ప్రకారం విధి నిర్వహించాలే తప్ప రాజకీయ కుట్రలో ఇరుక్కోవద్దని సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
Kavitha New Party TRS Name Dispute : టీఆర్‌ఎస్ పేరుపై కవితకు దిల్లీ హైకోర్టులో ట్విస్ట్! ఈసీనే తేల్చాలని ఆదేశం.. అసలు ఊరట దక్కినట్లేనా?
టీఆర్‌ఎస్ పేరుపై కవితకు దిల్లీ హైకోర్టులో ట్విస్ట్! ఈసీనే తేల్చాలని ఆదేశం.. అసలు ఊరట దక్కినట్లేనా?
Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
Breaking News: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Embed widget