అన్వేషించండి

Ponguleti: మాజీ ఎంపీ పొంగులేటి బంధువు ఇంట్లో 39 లక్షల విలువైన వాచ్ లు స్వాధీనం

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు ఇంట్లో వాచ్ లను ఎన్నికల అధికారులు బుధవారం సీజ్ చేశారు. వాటి విలువ రూ.39 లక్షలు ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు.

Ponguleti srinivas Reddy clocks seized:

ఎన్నికలు షెడ్యూల్ రావడంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తే చర్యలు తప్పవని ఎలక్షన్ అధికారులు నాయకులను హెచ్చరించారు. అయినా సరే కోట్లాది రూపాయాలు, మద్యం, ఖరీదైన గిఫ్టులు సీజ్ అవుతున్నాయి. తాజాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు ఇంట్లో వాచ్ లను ఎన్నికల అధికారులు బుధవారం సీజ్ చేశారు. పొంగులేటి బంధువు తుంబూరు దయాకర్ రెడ్డి ఇంట్లో 9750 వాచ్ లను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.
గతంలో తన కుమార్తె వివాహాన్ని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో పెళ్లికి వచ్చిన వారికి ఖరీదైన బహుమతులను ఆయన ప్రదానం చేశారు. కుమార్తె వివాహం సమయంలో పంచగా మిగిలిన వాచీలను బంధువు ఇంట్లో పెట్టామని పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు. అయితే ఎన్నికలవేళ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తారేమో అనే ఉద్దేశంతో ఆ వాచ్ లను అధికారులు సీజ్ చేసారు. ఎలక్షన్ అధికారులు సీజ్ చేసిన పొంగులేటికి చెందిన వాచీల విలువ దాదాపు రూ. 39 లక్షలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

ఎన్నికల్లో డబ్బు పంచే అవకాశాలున్నాయి - ఇన్ కం టాక్స్ డీజీ 
 నిన్నటివరకు (అక్టోబర్ 24 వరకు) 53.93 కోట్ల డబ్బు పట్టుబడిందని, అందులో ఎలాంటి డాక్యుమెంట్స్ లేని 1.76 కోట్లు సీజ్ చేశామని ఇన్ కం టాక్స్ డీజీ సంజయ్ బహదూర్ వెల్లడించారు. అందులో సరైన డాకుమెంట్స్ చూపించిన 10 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశామని తెలిపారు. మిగిలిన డబ్బు పై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అన్నారు. 156 కిలోల గోల్డ్, 454 కిలోల వెండి పట్టుబడిందని చెప్పారు. అంతే కాకుండా ఇప్పటివరకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ గా రైడ్స్ చేసి 14.8 కోట్లు సీజ్ చేసిందని, బ్యాంక్ అకౌంట్స్ పై నిఘా ఉంచామని తెలిపారు. 

ఇటీవల రెండు లారీలు సీజ్ - 2 కోట్ల విలువైన చీరలు స్వాధీనం

హైదరాబాద్ లో వారం రోజుల కిందట రెండు చీరల లోడ్ లారీలను పోలీసులు సీజ్ చేశారు. నగరంలోని బాచుపల్లి పియస్ పరిదిలోని ప్రగతినగర్ లో పంచవటి అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేశారు. 743 బ్యాగ్ లలో ఉన్న రూ.2 కోట్లకు పైగా విలువ చేసే చీరలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చీరల విలువ రూ. 2,25,98,590/- (రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంబై ఎనిమిది వేల 5 వందల తొంబై రూపాయలు) అని సమాచారం.    

ప్రగతినగర్ లోని అపార్ట్మెంట్ లో ఓ డబుల్ బెడ్ రూమ్ లో 2లారీల లోడ్ చీరలను డంప్ చేస్తున్న సమయంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లారీలను సీజ్ చేశారు. సంచులలో చీరలు ఉన్నాయని విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వరంగల్ ప్రాంతంలోని కాశంపుల్లయ్య, మాంగల్య  షాపింగ్ మాల్స్ నుంచి తాను చీరలు కొన్నానని వీటి యజమాని పోలీసులకు తెలిపారు. అయితే రిసీప్ట్ లాంటివి చూపించాలని, చీరల ఖరీదుకు సంబంధించి ఆధారాలు చూపించాలని పోలీసులు ఆయనకు సూచించారు. బాచుపల్లి పోలీసులు చీరలతో ఉన్న లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భైంసాలో విషాదం!2వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల పాప మృతి!
భైంసాలో విషాదం!2వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల పాప మృతి!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget