అన్వేషించండి

TS Congress : కాంగ్రెస్ సీనియర్లకు ఖర్గే ఫోన్ - రేవంత్ పాదయాత్రకు రెడ్ సిగ్నల్ పడిందా ?

రేవంత్ రెడ్డి పాదయాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వలేదని సీనియర్ నేతలు చెబుతున్నారు. పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే వారికి ఫోన్ చేశారు.

 

TS Congress :  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్న సీనియర్లు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. బుధవారం   బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. వీటికి హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు   మీటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడే నేరుగా ఫోన్ చేసి అడిగినందున వెళ్లకపోతే బాగుండదన్న  అభిప్రాయంతో వారు ఉన్నారు. వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు ఫోన్‌లో హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని... బహిరంగ విమర్శలు, కామెంట్స్ చేయొద్దన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ టూర్ తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు కూడా సీనియర్లెవరూ అటెండ్ కాలేదు. దిగ్విజయ్ సింగ్ ఓ నివేదికను పార్టీ హైకమాండ్ కు ఇచ్చారని చెబుతున్నారు. ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారని సీనియర్లు కూడా ఎదురు చూస్తున్నారు. 


టీ పీసీసీ అధ్యక్షుడ్ని లేదా ..  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌ను తొలగించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని కూడా అంటున్నారు. అందరూ కలిసి పాదయాత్ర చేయాలని.. ఒక్క రేవంత్ మాత్రమే చేయకూడదని వారి వాదన. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రను ఇప్పటికే ప్రకటించారు. హాత్ సే హాత్ జోడో యాత్రగా దీనికి నామకరణం చేయగా..జనవరి 26 నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. అయితే పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఏయే ప్రాంతాల గుండా వెళ్లాలి. ఎక్కడ మీటింగ్ లు జరపాలి. ఎక్కడ ముగింపు సభ ఏర్పాటు చేయాలనే అంశాలపై టీపీసీసీ కసరత్తులు చేస్తుంది. టీపీసీసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం నుండి ప్రారంభించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభతో ముగించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే అసంతృప్త  సీనియర్ నేతలు మాత్రం  రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు.  హత్ సే హత్ జోడోలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభియాన్ ముగింపులో భాగంగా హైదరాబాద్‌లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యూలర్‌లో 2 నెలల పాదయాత్ర అని వుందని.. కానీ జనవరి 26 నుంచి 5 నెలల పాటు పాదయాత్ర అన్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వెల్లడించిందని చెబుతున్నారు. ఏది నిజమో కానీ.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు మరోసారి గందరగోళంలో పడ్డాయి. 

టాప్ హెడ్ లైన్స్

Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget