అన్వేషించండి

Maghuyashki : టిక్కెట్ ఇచ్చినా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయను - మధుయాష్కీ కీలక ప్రకటన !

Congress News : లోక్‌సభ ఎన్నికల్లో హైకమాండ్ ఆదేశించినా తాను పోటీ చేయనని సీనియర్ నేత మధుయాష్కీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.

Congress Senior leader Madhuyashki : తాను ఎంపీ టికెట్ రేసులో లేనని, నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ చెప్పారు.  లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశించినా తాను పోటీ చేయనని స్పష్టం చేశారు.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 15 లోక్ సభ స్థానాలు అని చెప్పారు. మెజార్టీ స్థానాలు తమ పార్టీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని వెల్లడించారు. బీజేపీ నేతల కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేయడానికే అమిత్ షా వచ్చారని చురకలంటించారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చింది బీజేపీ గెలుపుకోసం కాదని, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చడానికని జోస్యం చెప్పారు.               

పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారని.. అందుకే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారన్నారు. తమ ప్రత్యర్థి కాంగ్రెస్ అని ఓ వైపు బీజేపీ.. మరోవైపు బీఆర్ఎస్ చెబుతున్నాయన్నారు. మజ్లిస్ పార్టీ మద్దతు లేకుంటే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి గెలవరని విమర్శించారు. ఇతర ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఎల్బీనగర్‌లో తనపై గెలిచిన  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.                                                

సుధీర్ రెడ్డి అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోకైనా జంప్ అవుతారని చెప్పారు. ఎన్నికల నాటికి ఎల్బీనగర్ లో 30 వేల ఫేక్ ఓట్లు యాడ్ అయ్యాయని చెప్పారు. గ్రేటర్ లో ముస్లింలు, సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్ కే పడ్డాయని అన్నారు.  మంత్రి వర్గ విస్తరణ విషయంలో హైకమాండ్ జోక్యం చేసుకోబోదని, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. మధుయాష్కీ గతంలో నిజామాబాద్ ఎంపీగాఓ సారి విజయం సాధించారు. రెండుసార్లు ఓడిపోయారు. ఇటీవల ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్థానికేతరుడు అని టిక్కెట్ ఇవ్వొద్దని చాలా మంది కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినా  హైకమాండ్‌కు సన్నిహితులు కావడంతో ఆయనకే చాన్స్ దక్కింది.                                   

ఇప్పుడు బీసీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఆయన ఆశిస్తున్నారు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్నారని చెబుతున్నారు. ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ ఇచ్చి  మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మధుయాష్కీ రాహుల్ గాంధీకి సన్నిహితులు. ఆయన చెబితే రేవంత్ రెడ్డి పదవి ఇస్తారని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఇష్టమని మధుయాష్కీ చెబుతున్నట్లుగా భావిస్తున్నారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Health : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Health : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Embed widget