అన్వేషించండి

Viral News: రూ.27 లక్షలు కళ్ల ముందు కనిపించినా ఆశపడలేదు - ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీకి ఫిదా

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీని సజ్జనార్ అభినందించారు. బస్సులో దొరికిన రూ. 27లక్షల విలువైన బంగారు నగల బ్యాగ్‌ను వారు ప్రయాణికులకు అందించారు.

RTC employees honesty: రోడ్డు మీద పది రూపాయలు దొరికితే తిరిగి ఇచ్చేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది 27 లక్షల రుపాయల విలువైన నగలు దొరికితే ఊరుకుంటారా?. అందరూ ఇలా ఉండాలని లేదు.చాలా కొద్ది మంది మాత్రం ఇతరుల సొమ్మును వారికి చేర్చాలని అనుకుంటారు. అలాంటి వారికి ఎవరి సొమ్ము అయినా దొరికితే.. వారి ఇంటికి చేరిపోతుంది. అలాంటి ఘటనే ఒకటి తెలంగాణ ఆర్టీసీలో జరిగింది. 

గ‌ద్వాల డిపో బ‌స్సు ఈ నెల 5న క‌ర్నూల్ నుంచి గ‌ద్వాల‌కు బ‌య‌లుదేరింది. ఆ బ‌స్సులో ఇద్దరు ప్రయాణికులు ఎక్కారు. గ‌ద్వాల‌కు బ‌స్సు రాగానే వారు దిగి వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలో రూ.27 ల‌క్ష‌ల విలువైన న‌గ‌లు, న‌గ‌దు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను మ‌రిచిపోయారు. బస్సులో ఆ బ్యాగ్‌ను గ‌మ‌నించిన కండ‌క్ట‌ర్, డ్రైవ‌ర్.. దానిని తెరిచి చూశారు. అందులో 25 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, రూ.40 వేల న‌గ‌దు, ఒక ల్యాప్‌టాప్‌ను గుర్తించారు. వెంటనేఆర్టీసీ అధికారుల‌కు స‌మాచారం చేర‌వేశారు. బ్యాగులో ఉన్న వివ‌రాల ఆధారంగా ప్ర‌యాణికులకు స‌మాచారం అందించారు. దీంతో వాటిని సుర‌క్షితంగా బాధితులకు అధికారులు అంద‌జేశారు. 

విధి నిర్వ‌హ‌ణ‌లో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం చాటుకున్నారు. బ‌స్సులో మ‌రిచిపోయిన రూ.27 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాల బ్యాగ్‌ను ప్ర‌యాణికులకు అంద‌జేశారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి రూ.27 లక్షల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికులకి అందజేసిన కండ‌క్ట‌ర్ సూరిబాబు, డ్రైవ‌ర్ పరుశురాములును సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు.   ఉదార‌త చాటిన గ‌ద్వాల డిపో కండ‌క్ట‌ర్ సూరిబాబు, డ్రైవ‌ర్ పరుశురాములును టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వారిని స‌న్మానించారు. 

స‌మ‌ర్థ‌వంతంగా విధులు నిర్వ‌ర్తిస్తూనే త‌మ‌లో ఉన్న మాన‌వ‌త్వ‌పు ఆలోచ‌న‌ల‌కు కార్య‌రూపం దాలుస్తూ స‌మాజంలో ఆర్టీసీపై మ‌రింత న‌మ్మ‌కం పెరిగేలా ఉద్యోగులు చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. 27 లక్షల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు. ఆవి పోతే.. ఆ కుటుంబం చాలా ఇబ్బందిపడేది. దొరికిందని.. అనుకోకుండా..  అవి పోగొట్టుకున్న వారి బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ ఉద్యోగులు వాటిని సొంత వారికి చేరేలా చేశారు. ఇలాంటి మంచితనం ఉండబట్టే ఇంకా సమాజంలో మానవత్వం మిగిలి ఉందన్న సంతృప్తి వ్యక్తమవుతూ ఉంటుంది.   

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తిరుపతిలో కూటమి సభ వాయిదా! చంద్రబాబు కీలక నిర్ణయం
తిరుపతిలో కూటమి సభ వాయిదా! చంద్రబాబు కీలక నిర్ణయం
CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఎక్కువ, ఆయన ఓ తాలిబన్: తెలంగాణ సీఎంపై కవిత ఆగ్రహం
రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఎక్కువ, ఆయన ఓ తాలిబన్: తెలంగాణ సీఎంపై కవిత ఆగ్రహం

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Slumdog Teaser : స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
This Week Theatrical Releases : పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
Embed widget