అన్వేషించండి

Attack On RTC Driver: మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై చెప్పుతో దాడి

Attack On RTC Driver: బస్సు ఆపలేదని, కారుకు దారి ఇవ్వలేదని ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడులు చేస్తున్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ మార్పు రావడం లేదు.

Attack On RTC Driver: బస్సు ఆపలేదని,  కారుకు దారి ఇవ్వలేదని ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడులు చేస్తున్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ మార్పు రావడం లేదు. డ్రైవర్లపై దాడులు ఆగడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లాలో అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామం సమీపంలో  మంగళవారం టీఎస్  ఆర్టీసీ బస్సు  డ్రైవర్ పై ఓ వ్యక్తి చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..  కరీంనగర్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. హన్మకొండ డిపోకు చెందిన బస్సు TS03UC6568నంబర్ బస్సు  డ్రైవర్ విజయేందర్ పై తాడికల్ గ్రామానికి చెందిన గాలిపల్లి అనిల్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. 

బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేస్తుండగా...  అదే సమయంలో బస్సుకు ఎదురుగా గాలిపల్లి అనిల్ బైక్ మీద వస్తున్నాడు.  ఈ సమయంలో అనిల్ బస్సు తన మీదికే వస్తుందని భ్రమపడ్డాడు. దీంతో వెంటనే బస్సుకు అడ్డం తిరిగి కోపంతో బైక్ బస్సు ఎదురుగా నిలిపాడు. బస్సును ఆపి లోపలికి ప్రవేశించి డ్రైవర్ పై ఆలోచన లేకుండా విచక్షణారహితంగా చెప్పు తో దాడి చేశాడు. దాడి చేసిన అనిల్ అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు.  ఈ సంఘటనలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ తతంగం అంతా చూస్తున్న ప్రయాణీకులు, కండక్టర్ కలుగ చేసుకుని అనిల్ అనే వ్యక్తిని పట్టుకుని అదే బస్సులో సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అకారణంగా డ్రైవర్ పై దాడికి పాల్పడినట్లు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  దాడి జరుగుతున్న తరుణంలో బస్సులోని ప్రయాణికులు కాసేపు భయబ్రాంతులకు గురయ్యారు.  డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అనిల్ ను శంకరపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు.

వికారాబాద్ డిపో డ్రైవర్ పై దాడి
ఇటీవల వికారాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రాములు పై నవాజ్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.  టిఫిన్ చేసేందుకు బస్సు ఆపడంతో  డ్రైవర్, కండక్టర్‌పై నవాజ్ విరుచుకుపడ్డాడు. ఇలాగైతే బస్సు లేటవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టిఫిన్ చేసి ఐదు నిమిషాల్లో బయలుదేరుదామని నచ్చజెప్పినా అతడు వినలేదు.  బూతులు తిడుతూ నవాజ్ వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో డ్రైవర్లు బస్సులను ఎక్కడివక్కడ నిలిపివేశారు. రాములుపై దాడిచేసిన నవాజ్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ  ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిపోకు చెందిన 45 బస్సులు డ్రైవర్ల నిరసన కారణంగా  నిలిచిపోవడంతో వికారాబాద్, తాండూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  

టాప్ హెడ్ లైన్స్

Indiramma Towers: వారానికి ఒకసారి వచ్చి మీ ఇల్లు చూసుకోండి- ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి
వారానికి ఒకసారి వచ్చి మీ ఇల్లు చూసుకోండి- ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి
Vote for Note Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన స్టీఫెన్‌సన్‌
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన స్టీఫెన్‌సన్‌
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
TGERC True Up Charges: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget