అన్వేషించండి

Revanth Reddy: ధాన్యం కొనుగోలుపై మోడీ, కేసీఆర్ నాటకాలాడుతున్నారు

కామారెడ్డి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించారు. రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోళ్ల తీరును ఆడిగి తెలుసుకున్నారు. బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

దేశంలో మోడీ, రాష్టంలో కేసీఆర్ నాటకాలాడుతున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటులో ప్రధానమంత్రిని నిలదీసి వరి పంటను కొనేలా చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లాలో శుక్రవారం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ మేరకు బిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో కల్లాల్లో కి రేవంత్ రెడ్డి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కు పోయే కాలం వచ్చింది కాబట్టి రైతులతో పెట్టుకుంటున్నాడని అన్నారు. కేసీఆర్ ఏసీలో కూర్చొని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం కాదు, రైతుల కల్లాల్లోకి వచ్చి వరి కుప్ప పై కూర్చొని సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. 

దొంగ ధర్నాలతో తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని రేవంత్ రెడ్డి అన్నారు. మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉండే ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ ,బండి సంజయ్ లు డ్రామా యాక్షన్ కమిటీ మొదలెట్టారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఫాం హౌస్ లో కూర్చొని పరిపాలన చేయడం వల్లనే రైతులకు ఈ దుస్థితి పట్టిందని ఆరోపించారు. రైతుల సమస్యలు తెలుసుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలతో రైతులు కల్లాల వద్ద ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు భరోసా ఇవ్వడానికి కల్లాల కాంగ్రెస్ పేరిట ఈ నెల 29 వరకు తెలంగాణ ప్రాంతం అంతటా పర్యటిస్తామన్నారు.


రోజులుగా ధాన్యం కుప్పల వద్ద ఉంటున్నామని, కొనుగోళ్లలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని రైతులు.. రేవంత్ కు వివరించారు. వద్దంటే వరిపంట సాగు చేశారని రైతులపై కేసీఆర్ కక్ష గట్టారని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్ లు నాటకాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు. యూపీ ఎన్నికల కోసమే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసిందని అన్నారు. ప్రాణాలు పోయిన రైతు కుటుంబాలకు మోదీ క్షమాపణ చెప్పాలని, రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: Anantapur Rains: కదిరిలో కూలిన భవనాలు.. ముగ్గురు చిన్నారులు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది

Also Read: Nagababu: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget