అన్వేషించండి

Revant Vs Talasani : రేవంత్, తలసాని మధ్య పిసుకుడు చాలెంజ్ - ఎక్కడ ప్రారంభమయిందంటే ?

రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. వీరి భాష పరిధి దాటిపోతోంది.

Revant Vs Talasani :  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ల మధ్య పిసుకుడు చాలెంజ్ ప్రారంభమయింది.   కాంగ్రెస్ యువ సంఘర్షణ‌ సభలో ప్రియాంకగాంధీ యూత్‌ డిక్లరేషన్ ప్రకటనపై స్పందించేందుకు మంగళవారం ప్రెస్ మీట్ పెట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు.  ‘‘ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందు.. పిసికితే పాణం పోతది’’’ అని పరోక్షంగా రేవంత్‌రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడి్యాలో వైరల్ అయ్యాయి.                                   

తలసాని చేసిన కామెంట్లు దుమారం రేపడంతో . రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తలసానిని దున్నపోతుతో పోల్చి తీవ్ర విమర్శలు చేశారు.  దున్నపోతులతో తిరిగిన దున్నపోతు తలసాని శ్రీనివాస్‌యాదవ్ అని, మొదట్నుంచి పశువుల పేడ పిసుక్కున్న అలవాటు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఉందని, అందుకే పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  సెటైర్ వేశారు.   అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్లాడే వాళ్ళేనా అని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే,ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానని,అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని సవాల్ చేశారు.                                        

కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అంటూ  మండిపడ్డారు.  మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన, కేటీఆర్ సంక నాకినా ఈ స్థాయికి రాలేరని తేల్చిచెప్పారు. ఇంకా ఏదైనా మోజుంటే, మోజు తీర్చుకోవాలంటే తాను వస్తానని రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తేల్చి చెప్పారు.                              

రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో తలసాని కూడా స్పందించే అవకాశం ఉంది. ఇద్దరూ ఒకప్పుడు టీడీపీలో కలిసి పని చేసిన వారే. 2014లో  ఇద్దరూ టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత తలసాని టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. అప్పట్లో కూడా రేవంత్ రెడ్డి, తలసాని మధ్య ఘాటు విమర్శలు చోటు చేసుకునేవి. ఇప్పుడు మరోసారి..తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనను పిసికిస్తానని చేసిన వ్యాఖ్యలతో మరోసారి దుమారం ప్రారంభమయింది.           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shock for Gold Men: బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!
బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!
Cinematic Love Story: తాళికట్టే సమయంలో తమ ప్రేమకథను చెప్పిన పెళ్లికూతురు - ఆ పెళ్లి కొడుకు చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్!
తాళికట్టే సమయంలో తమ ప్రేమకథను చెప్పిన పెళ్లికూతురు - ఆ పెళ్లి కొడుకు చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్!
TRS Kavitha : కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Hero Scooty Models: హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?
హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
Sai Durgha Tej New Movie : 'క' డైరెక్టర్స్‌తో సుప్రీం హీరో - సాయి దుర్గా తేజ్ పాన్ అడ్వెంచర్ మూవీ అనౌన్స్
'క' డైరెక్టర్స్‌తో సుప్రీం హీరో - సాయి దుర్గా తేజ్ పాన్ అడ్వెంచర్ మూవీ అనౌన్స్
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Embed widget