అన్వేషించండి

Revanth Reddy : తెలంగాణలో D-9 గ్యాంగ్ - రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

కేసీఆర్ భూదందాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేబిఆర్ పార్క్ దగ్గర నిర్మిస్తున్న ఓ భవనం విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు.


Revanth Reddy :   తెలంగాణలో ఏడుగురు ఐఏఎస్‌లు, కేసీఆర్, కేటీఆర్ డీ-9 గ్యాంగ్‌గా ఏర్పడి భూదందాలకు పాల్పడుతున్నారని  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కేబిఆర్ పక్కన నిర్మిస్తున్న ఓ భారీ భవన నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించారు. అక్కడ మూడు వేల గజాల్లో 21 అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని..  అక్కడ  ఐదు అంతస్తుల కన్నా ఎక్కువ ఏ ఒక్క భవనానికీ పర్మిషన్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.               

బంజారాహీల్స్, జూబ్లీహీల్స్ ప్రాంతాల్లో నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  కేబీఆర్ పార్క్ దగ్గర నిర్మాణాలకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. అందుకే పార్క్ చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ లు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కేసీఆర్ వచ్చాకే కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలు పెరిగాయన్నారు.   బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ దగ్గర  నిజాం హెరిటేజ్ బిల్డింగ్ ఉండేదని.. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టారని ఆరోపించారు.   హెరిటేజ్ బిల్డింగ్ ను కుర్రా శ్రీనివాస రావు  అనే వ్యక్తి కొన్నారని వెల్లడించారు.   

అయితే శ్రీనివాస రావుకు అనుమతుల కోసం  కొంత భూమిని లంచంగా అడిగారని ఆరోపించారు.  ఇరవై శాతం భూమిని తీసుకుని  గ్రీన్ జోన్ లో ఉన్న వారసత్వ బిల్డింగ్ ను కూలగొట్టి కొత్త నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు.   గ్రీన్ జోన్ లో  కొత్త నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  రూల్స్ విరుద్ధంగా కొత్త భవనానికి అనుమతిచ్చారని ఆరోపించారు. 5 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇవ్వని చోట.. 21 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు.  3 వేల గజాల స్థలంలో 21 అంతస్థులకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. పక్కనే ఉన్న బసవతారకం ఆస్పత్రికి 3 అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదన్నారు.                                             

ఏడుగురు ఐఏఎస్ లు, ఇద్దరు తండ్రీ కొడుకులు కలిసి డీ 9 గ్యాంగ్ గా మారారని విమర్శించారు.  20 శాతం భూములు రాసిచ్చిన వారికే నిర్మాణాలకు అనుమతిచ్చారని ఆరోపించారు రేవంత్. 21 అంతస్థుల అపార్ట్ మెంట్ వల్ల  కేబీఆర్ పార్క్ దగ్గర  భారీగా ట్రాఫిక్ సమస్యలు వస్తాయన్నారు రేవంత్. కేసీఆర్ దుర్మార్గపు పాలనకు ఇది పరాకాష్ట అని ..మీ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఇంత విధ్వంసం సృష్టిస్తారా? అని మండిపడ్డారు రేవంత్. తెలంగాణ సీఎం కేసీఆర్ భూదందాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే కొద్ది రోజుల పాటు ఇలా అనేక అక్రమాలను బయట పెడతానని అంటున్నారు.                        

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్‌కు సీఎం రేవంత్ సవాల్ - డేట్,టైం చాయిస్‌ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కే !
కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్‌కు సీఎం రేవంత్ సవాల్ - డేట్,టైం చాయిస్‌ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కే !
Konda Surekha Letter CM Revanth : దేవాదాయశాఖలో కడియం శ్రీహరి జోక్యం - కొండా సురేఖ ఆగ్రహం - సీఎంకు ఘాటు లేఖ
దేవాదాయశాఖలో కడియం శ్రీహరి జోక్యం - కొండా సురేఖ ఆగ్రహం - సీఎంకు ఘాటు లేఖ
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget