CM Revanth Reddy Indravelli : ప్రభుత్వాన్ని పడగొడతానంటే పండబెట్టి తొక్కుతాం - బీఆర్ఎస్‌కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
Revanth : ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారిపై రేవంత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇక ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కూడా కాలేరని స్పష్టం చేశారు.
Revanth : ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారిపై రేవంత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పండబెట్టి తొక్కుతామని ఇంద్రవెల్లి తెలంగాణ పునర్నిర్మాణ సభలో హెచ్చరించారు. ఆరు నెలలే ప్రభుత్వం ఉంటుందంటున్న బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్లు రాలగోడతామని హెచ్చరించారు. ఆ ఇంటి మీద పిట్టే ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామని బీఆర్ఎస్ జంపింగ్ జిలానీలను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నిత్యానందలాగా దీవిని కొనుక్కుని రాజుగా ప్రకటించుకో కేసీఆర్ !
దేశంలో రెండే రెండు కూటములు ఉంటాయని.. ఒకటి మోడీ కూటమి అని, మరొకటి ఇండియా కూటమి అని రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ తమ కూటమిలోకి మాత్రం కేసీఆర్‌ను రానివ్వమని తేల్చి చెప్పారు. బీజేపీకి గానీ, బీఆర్ఎస్ గానీ 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రాన్ని మళ్లీ మోడీకి అమ్ముకుంటారని రేవంత్ జోస్యం చెప్పారు. మోదీ ఎవరి ఖాతాలోనైనా 15 లక్షలు వేశారా అని రేవంత్ ప్రశ్నించారు. దేశంలో రెండే రెండు కూటములు ఉంటాయని.. ఒకటి మోడీ కూటమి అని, మరొకటి ఇండియా కూటమి అని రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ తమ కూటమిలోకి మాత్రం కేసీఆర్‌ను రానివ్వమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కు తగ్గలేదన్నారు. అడవి బిడ్డల ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పారు. ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేస్తామని సమర శంఖారావాన్ని పూరించామని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరి చేతుల్లో బందీ అయిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీల బిడ్డలను ఆదుకుంటామని తెలిపారు. ఆదివాసీలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది లేదన్నారు. తన కుటుంబానికి ఉద్యోగాలు తప్ప అమరవీరులను, ఈ రాష్ట్ర యువతను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్టించుకోలేదన్నారు.ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఇప్పటికైనా ఆలోచించమని రేవంత్ రెడ్డి కోరారు.
15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్థి చేస్తామని తెలిపారు. హెలికాప్టర్ నుంచి చూస్తే ఎడారిలా కనిపిస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. పార్లమెంటు స్థానాలు బీఆర్ఎస్ కు ఎన్ని ఇచ్చినా మోదీకి అమ్ముకున్నారని, మళ్లీ ఇస్తే అదే జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ దగ్గర గులాంగిరీ చేయడానికే రేవంత్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రజల వద్దకు వస్తున్నారని రేవంత్ అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.10 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సు పోస్టులనే భర్తీ చేశారా. బిల్లా రంగాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని చేసినప్పుడు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులు గుర్తురాలేదా అని మండిపడ్డారు.
లక్ష మంది మహిళలకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్
త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఇది ప్రజలకోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం. గద్దర్ ఉసురుతగిలి పోయారు. ‘దళిత గిరిజన దండోరా సభ’ను ఇక్కడే నిర్వహించుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మట్టికి గొప్పతనం ఉందన్నారు. ఇక్కడ వేసే అడుగులో పోరాట పటిమ ఉందన్నారు. చరిత్ర పుటలో పౌరుషం గురించి చర్చించాలంటే రాంజీగోండ్ గురించి ప్రస్తావించాలని చెప్పారు. రాంజీగోండ్ పోరాట స్పూర్తిని ఆర్శంగా తీసుకున్నాని రేవంత్ తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడ్డ ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటామని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.అందులో భాగంగానే శుక్రవారం రూ 60 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధివైపు నడిపించే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. గూడేలకు రోడ్లు, నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు.