అన్వేషించండి

Rajagopal Reddy : సుశీ ఇన్‌ఫ్రా నాది కాదు.. ఆ కోట్లతో సంబంధం లేదు - ఈసీకి రాజగోపాల్ రెడ్డి ఆన్సర్ ఇదే !

సుశీ ఇన్ ఫ్రాతో తనకు సంబంధం లేదని ఈసీకి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. బీజేపీ నేతలకు బదిలీ అయినట్లుగా చెబుతున్న సొమ్ముతో తనకు సంబంధం లేదన్నారు.


Rajagopal Reddy :   మునుగోడు నియోజకవర్గంలో  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చారు. సుశీ ఇన్ ఫ్రా కంపెనీతో తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు. ఆ సంస్థ ఎవరికి డబ్బులు పంపిందో తనకు తెలియదన్నారు. ఇవే వివరాలతో తాను ఎన్నికల సంఘానికి సమాధానం పంపానని... రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి   కుటుంబ సభ్యులకు చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా నుంచి ఈ నెల 14, 18, 29న పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగిందని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్  ఈసీఐకి ఫిర్యాదు చేశారు. 

ఆన్ లైన్ నగదు  బదిలీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని టీఆర్ఎస్ ఫిర్యాదు

దాదాపు రూ.5.24 కోట్లను మునుగోడు నియోజకవర్గంలోని  23 మందికి చెందిన బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ నగదుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.ఒకవేళ ఈ నగదు మీ ఆదేశాలతో కంపెనీ బదిలీ చేసి ఉన్నట్లయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆ ఖాతాల్లోకి నగదు జమ చేయలేదని భరోసా ఇవ్వాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. అయితే అసలు సుశీ ఇన్ ఫ్రా కంపెనీతో తనకు సంబంధం లేదని రాజగోపాల్ రెడ్డి ఆన్సర్ ఇచ్చారు. అది తన కుమారుడి కంపెనీ అని.. ఆ కంపెనీ చేసే లావాదేవీలపై తనకు ఏ మాత్రం సమాచారం ఉండదన్నారు. 

రాజగోపాల్ రెడ్డి వివరణను చూసి చర్యలపై నిర్ణయం తీసుకోనున్న ఈసీ 

సోమవారం సాయంత్రం నాలుగు గంటలలోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. అంత కంటే ముందే ఈసీ కి రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దీంతో నాలుగు గంటల తర్వాత ఈసీ రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సమాధానాన్ని సమీక్షించి సంతృప్తి చెందకపోతే ఏదో ఓ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ సంతృప్తి చెందితే మాత్రం ఎటువంటి చర్యలు ఉండవు. అయితే ఆ డబ్బులు ఓటర్లను  పంచడానికేనని.. నిరూపించే ఆధారాలు టీఆర్ఎస్ సమర్పిస్తే.. ఈసీ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కానీ అసలు ఆ డబ్బు గురించే తనకు తెలియదని బీజేపీ అభ్యర్థి స్పష్టం చేస్తున్నారు. 

అత్యంత ఖరీదుగా మారిన మునుగోడు ఉపఎన్నిక

మునుగోడు ఉపఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి మునుగోడుకు తరలిస్తున్నట్లుగా భావిస్తున్న రూ. కోట్లు పట్టుబడుతున్నాయి. హవాలా ఏజెంట్ల నుంచి ఈ నగదు తరలి పోతోంది. ఇలా పట్టుబడుతున్న సొమ్ము అంతా..  బీజేపీదేనని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలోని బీజేపీ నేతల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినట్లుగా టీఆర్ఎస్ గుర్తించి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget