News
News
వీడియోలు ఆటలు
X

Eatala Rajender: బీజేపీలో పొంగులేటి, జూపల్లి చేరతారా? వారితో భేటీ తర్వాత ఈటల కీలక వ్యాఖ్యలు

పొంగులేటి, జూపల్లికి పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. భేటీ తర్వాత ఈటల మీడియాతో మాట్లాడారు.

FOLLOW US: 
Share:

కేసీఆర్‌ను బొందపెట్టే ఏకైక పార్టీ బీజేపీనే అని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించామని, ఆయన సానుకూలంగానే ఉన్నారని అన్నారు. పొంగులేటితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కలిసి పనిచేసి కేసీఆర్‌ను గద్దె దించుతామని అన్నారు. పొంగులేటి, జూపల్లికి పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.

టీఆర్ఎస్ అసంతృప్త, బహిష్కృత నేతలను ఆకర్షించి వచ్చే ఎన్నికల్లో లాభం పొందే దిశగా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీ చేరికల కమిటీ టీమ్ భేటీపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టత ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకే వారిని కలిశానని చెప్పారు. అయితే, పొంగులేటి, జూపల్లితో బీజేపీ చేరికల కమిటీ టీమ్ నేడు (మే 4) భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరు దాదాపు 4 గంటలుపైగా చర్చలు జరిపారు. పొంగులేటి నివాసంలో వీరి సమావేశం జరిగింది.

అనంతరం ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పొంగులేటికి, జూపల్లికి టీఆర్ఎస్ పార్టీలో ఎదురైన సమస్యలు, అవమానాలు తమకు తెలుసని అన్నారు. బీజేపీలో అవన్నీ ఉండబోవని తెలిపారు. 

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ ఏకమయ్యేలా చూడాలని అన్నారు. మాయ మాటలతో మూడోసారి సీఎం కావాలనే ఆశ కలగానే మిగులుతుందని అన్నారు. ఏ పార్టీ వాళ్లయినా తమతో సంప్రదింపులు జరిపి, తమ పార్టీలోకి ఆహ్వానించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చినా కమ్యూనిస్ట్‌లు వచ్చినా స్వాగతిస్తామని అన్నారు. బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని పొంగులేటి గుర్తు చేశారు. కేసీఆర్‌ ఖమ్మంలో పోటీచేస్తే ఆయనపై కూడా పోటీచేస్తానని పేర్కొన్నారు. బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని ప్రస్తావించారు. అయితే తాను ఏ పార్టీలో చేరతాననే దానిపై ఈ నెలాఖరుకు స్పష్టత వస్తుందని అన్నారు.

Published at : 04 May 2023 08:10 PM (IST) Tags: Eatala Rajender Telangana BJP Jupalli Krishna Rao Ponguleti srinivas

సంబంధిత కథనాలు

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?