అన్వేషించండి

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

అరవింద్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన ఆర్ముర్ లేదా కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్ జిల్లా పొలిటికల్ స్ట్రీట్‌ హీటెక్కుతోంది. టీఆరెస్ పార్టీలో జిల్లా రాజకీయాల్లో కిరోల్ పోషిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇందూరు జిల్లా కమలం పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు ఎంపీ అరవింద్. ఈ ఇద్దరి మధ్య నడచి మాటల యుద్ధం జిల్లా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడు ఓపికగా ఉండే ఎమ్మెల్సీ కవిత... ఒక్కసారిగా ఎంపీ అరవింద్‌పై ఫైర్‌ అయ్యారు. ఈ క్రమంలో అరవింద్ ఎక్కడ పోటీ చేసిన వెంటబడించి ఒడిస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత. కవిత ఛాలెంజ్ వెనుక వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల్లో కవిత ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా బరిలో ఉంటారా అన్నది జిల్లా పాలిటిక్స్‌లో ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇటు ఎంపీ అరవింద్ కూడా కవిత సవాల్ ను స్వీకరించారు. ఇద్దరు నేతల సవాల్ ప్రతి సవాళ్లు అటు ఇరు పార్టీలలో ఓవరాల్ గా జిల్లా రాజకీయాల్లో ఆసక్తిర అంశంగా మారింది. 

వచ్చే ఎన్నికల్లో పోటీ అసెంబ్లీకా? పార్లమెంట్‌కా? 

కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె పదవి కాలం ఇంకా దాదాపు 4 ఏళ్ళు ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో కవిత బరిలో ఉంటాను అనే సంకేతమైతే ఇచ్చారు. అది కూడా ఎంపీ అరవింద్‌పై పోటీకి రెడీ అంటున్నారు. అరవింద్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బరిలో ఉండి ఒడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్‌తో ఎమ్మెల్సీ కవిత ఎంపీగా బరిలో ఉంటారా లేక ఎమ్మెల్యేగానా అన్న సందేహం పార్టీ క్యాడర్‌లో వచ్చింది. సవాల్ చేసినట్టు అరవింద్ ఎంపీగా పోటీ చేస్తే కవిత కూడా ఎంపీగా బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఎంపీగా చేసిన అనుభవం కవితకు ఉంది. 

అరవింద్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన ఆర్ముర్ లేదా కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కవిత అసెంబ్లీకి మొగ్గు చూపుతారా అన్న ప్రశ్నలు జిల్లా రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. అరవింద్ మాత్రం ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యే గా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఎమ్మెల్సీ కవిత కూడా ఎమ్మెల్యేగా బరిలో ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కవిత నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారన్నది టీఆరెస్ పొలిటికల్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి కవిత బరిలో ఉండాలని పార్టీలో శ్రేణులు అర్బన్ టీఆరెస్ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో కవిత ఉంటే రాజకీయంగా బాగుంటుందన్నది క్యాడర్ భావన. కవిత ఎంపీగా వస్తారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్న క్లారిటీ మాత్రం ఆమె ఇవ్వలేదు. జిల్లా పాలిటిక్స్‌లో మాత్రం కవిత ఎమ్మెల్యేగా అర్బన్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమైతే జోరుగా సాగుతోంది. 

ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ కవిత ఈ ఇద్దరు తమ తమ పార్టీల్లో కీలక నేతలు. కవిత చేసిన సవాల్‌ను దృష్టిలో పెట్టుకుంటే అరవింద్ ఎమ్మెల్యే లేదంటే ఎంపీగా బరిలో ఉంటే కవిత కూడా ఆయన మీద పోటీ చేయాలి. లేదంటే అధిష్టానం ఆదేశాలను పాటించాలి. రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు కామన్ అని కొందరు లైట్ తీసుకునే వాళ్ళు లేకపోలేరు. చూడాలి మరి ఇందూరు జిల్లాలో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య వార్ ఎలా ఉండబోతోందో.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget