అన్వేషించండి

Vemula Prashanth Reddy: నోరు జాగ్రత్త బండి సంజయ్, నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన శాస్తి తప్పదు: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కామారెడ్డిలో నోటికొచ్చినట్లు మాట్లాతున్నారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Vemula Prashanth Reddy On Bandi Sanjay: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని తెలంగాణ రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కామారెడ్డిలో నోటికొచ్చినట్లు మాట్లాతున్నారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రైతుల కోసం ఏం చేయాలో నీతో చెప్పించు కోవాల్సిన గత్యంతరం మాకు పట్టలేదని అన్నారు. దేశం మొత్తంలో అత్యంత గొప్పగా గౌరవం పొందుతున్న రైతు తెలంగాణ రైతు అని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. రైతులకు ఏమీ చేయాలో తమకు తెలుసునని, కావాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి నీ సలహాలు ఇవ్వు అని చురకులు అంటించారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం మద్దతు ధర ఇవ్వక పోగా.. ఎరువుల ధరలు మూడు రెట్లు పెంచి రైతుల నడ్డి విరుస్తోందని, ప్రశ్నించిన రైతులను వాహనాలతో తొక్కించిన చరిత్ర బీజేపీ పార్టీదని మండిపడ్డారు. రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలుసుకోవాలని బండి సంజయ్ కి సూచించారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ రైతులను అరిగోసా పెడుతూ నిండా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. అట్లాంటి వారు రైతు కోసం మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్మరన్నారు. 
కేవలం రాజకీయ లబ్దికోసమే తన హైకమాండ్ ఆదేశాల మేరకే కామారెడ్డి లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ డ్రామాకు తెరలేపాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ కి చేతనైతే కేంద్రంతో మాట్లాడి సిలిండర్ ధర తగ్గించాలి.. వ్యవసాయ రంగం మీద వేసే పన్నులు తగ్గించాలి.. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తమన్న ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పి హామీ ఇచ్చిన లక్షలు రూపాయలు అకౌంట్లలో జమ చేయించాలన్నారు. తెలంగాణ అభివృధ్ధి ని అన్ని విధాల అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించి, దమ్ముంటే మెడికల్ కాలేజీలు తీసుకురా..! కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినవి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తుందని వాటి గురించి కేంద్రంతో మాట్లాడి తీసుకురా అని బండి సంజయ్‌కు మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ చేశారు. 

రైతుల రక్తాన్ని పీల్చుకుని తింటున్న రాకాసి బీజేపీ మాయ మాటలు దయచేసి రైతులు ఎవ్వరూ నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్నది రైతు ప్రభుత్వమని, రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంయమనం పాటించాలని సమయం ఇదంటూ రైతులకు మరోమారు మంత్రి విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి మాస్టార్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టు మెట్లెక్కారు. అయితే బుధవారానికి విచారణ వాయిదా పడింది. ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లను కలిసి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయాలని రైతులు కోరారు. ఈనెల 11న మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా ముగుస్తోంది. 12న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయాలని అన్నదాతలు కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి వినతి పత్రం కూడా ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget