ఏనుగు రవీందర్ రెడ్డి మళ్లీ పార్టీ మారుతున్నారా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?
మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంధర్ రెడ్డి పార్టీ మారుతాన్న ప్రచారం. జిల్లా పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తోన్న ప్రచారం. తిరిగి కారు గూటికి చేరుతారని గుసగుసలు. ఖండించిన ఏనుగు. అయినా పనిగట్టుకుని ప్రచారం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మారన రాజకీయ పరిస్థితుల కారణంగా కండువాలు మార్చారు. ప్రస్తుతం సదరు లీడర్ సొంత గూటికి వెళ్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ నాయకుడు మాత్రం అదేం లేదని చెప్పుకోవాల్సి వస్తోంది.
ఇంతకీ ఈ ప్రచారం చేస్తున్నదెవరు. అసలు ఆ నేత మనసులో పార్టీ మరే ఆలోచన ఉందో లేదో గానీ కామారెడ్డి జిల్లాలో గుసగుసలు మాత్రం ఎక్కువయ్యాయ్. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. టీఅర్ఎస్ నుంచి బీజేపీలో ఈటెల రాజేందర్‌తో జాయిన్ అయ్యారు. ఇటీవల కొంత కాలంగా ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి కారు ఎక్కాలని భావిస్తున్నట్టు ప్రచారం హాట్ హాట్‌గా సాగుతోంది.
ఉద్యమకాలంలో టీఆర్ఎస్‌తో కలిసి పని చేసి అభిప్రాయ భేదాలు కారణంగా పార్టీని వీడిన వారిని ఆకర్షిస్తోంది గులాబీ పార్టీ. వారిని తిరిగి పార్టీలోకి రప్పించేదుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీజేపీ నుంచి స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ తిరిగి గులాబీ కండువా కప్పుకున్నారు. వీరి బాటలో ఏనుగు రవీందర్‌రెడ్డి సైతం పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రవీందర్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పుడల్లా అనుచరులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీ మారేది లేదని రవీందర్ రెడ్డి ఖండిచండ షరామాములుగా మారిపోయింది. అధికార పార్టీ నేతలు రవీందర్ రెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై ఆరా తీస్తున్నారు. ఆటూ బీజేపీ నేతల్లో కూడా ఒక్కింత ఆందోళన మొదలైంది... ఈ విషయం నిజమేనా అని తెలుసుకోవడానికి అనుచరులు ఫోన్లు చేయడంతో రవీందర్ రెడ్డి తాను పార్టీ మారేదిలేదంటూ ఓ ఆడియో కూడా విడుదల చేశారు.. అయినా అనుచరులు ఒక్కింత ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు..
ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గులాబీ పార్టీలో ఉద్యమ కాలంలో కామారెడ్డి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన జాజుల సురేందర్ ఆ పార్టీని వీడి కారెక్కేశారు. సురేందర్ చేరికతో మాజీ ఎమ్మేల్యే ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కమలం గూటికి చేరారు. కొందరు పని గట్టుకుని ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారతారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారని అంటున్నారు ఏనుగు అనుచరులు.
రవీందర్ రెడ్డి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ ఒకింత ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి వస్తారనే ప్రచారంలో ఎంత వరకు నిజముందో లేదో తెలియదు గానీ ప్రచారంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ రాజకీయాలను హీట్ పుట్టిస్తున్నాయ్. సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేంధర్, కాషాయ పార్టీ నేతలు సైతం రవీందర్ రెడ్డి కదలికలపై ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో రెండు పార్టీల్లోనూ రవీందర్ రెడ్డి పై అనుమానాలు మొదలయ్యాయి.
రాజకీయాల్లో ఏదైనా సాద్యమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరి తెలియదంటున్నారు. అయితే ఏనుగు రవీందర్‌రెడ్డి మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కానీ ఆయన మాత్రం తాను పార్టీ మారటం లేదన్న విషయాన్ని గట్టిగానే చెబుతున్నారు. బీజేపీలోనే కొనసాగుతానంటున్నారు. అయితే ఇప్పటికే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బాణాల పోటీ చేశారు. ఈసారి తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. మరి ఏనుగు పరిస్థితి ఏంటీ సరే అటు టీఆర్ఎస్ లో చేరినా... ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేంధర్ ను కాదని కారు పార్టీ ఏనుగు టికెట్ ఇస్తుందన్న గ్యారెంటీ ఉందా ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.