అన్వేషించండి

Nizamabad News: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ యూనివర్శిటీ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ యూనివర్సిటీ. ఏడాది కాలంలో నలుగురు రిజిస్ట్రార్లను మార్చి వీసీ. వీసీ తీరుపై విద్యార్థి సంఘాల మండిపాటు. మూడో రోజు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు.

మొదట్లో తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడి విద్యార్థులకు ఓ వరం అనుకున్నారు. కానీ నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఓ వైపు యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం గత మూడు రోజులుగా యూనివర్సిటీ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి తమ నిరసనలు తెలుపుతున్నారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్న వీసీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఫై సౌకర్యం కూడా లేని దుస్థితి నెలకొందని... యూనివర్సిటీలో కనీస వసతులు కరవయ్యాయని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా వీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 

ఏడాది కాలంలో నలుగురు రిజిస్ట్రార్ల మార్పు

తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారనటానికి ఏడాది కాలంలో నలుగురు రిజిస్ట్రార్లను మార్చటమే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నాయ్ విద్యార్థి సంఘాలు. ప్రస్తుత రిజిస్ట్రార్ ఆచార్య శివశంకర్ స్థానంలో టెంపరరీగా ప్రొఫెసర్ విద్యావర్ధిణిని అపాయింట్ చేస్తూ... వీసీ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రొఫెసర్ రవీందర్ గతేడాది మేలో వీసీగా తెలంగాణ యూనివర్సిటీలో ఛార్జ్ తీసుకున్నారు.  ఇప్పటి వరకు ఆయన నలుగురు రిజిస్ట్రార్లను మార్చారు. యూనివర్సిటీ ప్రారంభమైన నాటి నుంచి ముగ్గురు రెగ్యులర్ వీసీలు పనిచేసినా.... ఇంత మందిని ఎప్పుడు మార్చలేదు. ప్రస్తుతం వీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి తనకు నచ్చిన వారిని రిజిస్ట్రార్‌గా అపాయింట్ చేసుకునే రైట్స్ వీసీకి ఉంటాయ్. కానీ, స్వల్ప కాలంలోనే నలుగురిని మార్చడం వెనుక కారణాలు ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ రిజిస్ట్రార్లను మార్చటం వల్ల తెలంగాణ యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ వస్తోందని విద్యార్థి నాయకులు అంటున్నారు.

2021 మేలో వీసీ రవీందర్ బాధ్యతలు తీసుకున్న సందర్భంలో నసీం రిజిస్ట్రార్‌గా ఉన్నారు. సెప్టెంబరు 13 ఆమెను తప్పించారు. ప్రొఫెసర్ కనకయ్యను నియమిస్తూ... ఉత్తర్వులిచ్చారు. గతేడాది అక్టోబరు 30న జరిగిన పాలకమండలి సమావేశంలో ఆయన నియామకం తిరస్కరణకు గురైంది. వెంటనే ఆచార్య యాదగిరికి బాధ్యతలు ఇచ్చారు. 40 రోజులకే ఆయణ్ని తప్పించి.. డిసెంబరు 9న శివశంకర్ ను అపాయింట్ చేశారు. పాలకమండలి సమావేశంలో కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్లల్... ప్రొఫెసర్ యాదగిరిని స్వయంగా నియమించారు. అయన నియామకాన్ని కాదని శివశంకర్ ను వీసీ తీసుకొచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య సయోధ్య ఉంటుందని అంతా భావించారు. కానీ, పలు అంశాల్లో వీసీకి, రిజిస్ట్రార్‌కు మధ్య పొసగట్లేదని సమాచారం. అయితే శివశంకర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈసీ మీటింగ్ జరగలేదు. ఇంతలోనే విద్యావర్ధిణికి బాధ్యతలు అప్పగించారు.

రిజిస్ట్రార్ శివశంకర్ వ్యక్తిగత పనుల్లో భాగంగా సెలవుల్లో ఉన్నారు. ఈలోగానే ఆయన్ని మార్చటంపై విమర్శలు వస్తున్నాయ్. టెంపరెరీగా రిజిస్ట్రార్‌ను ఎవరినైనా నియమించుకొనే అధికారం వీసీకి ఉన్నప్పటికీ.. దాన్ని ఈసీ మీటింగ్ పెట్టి సభ్యుల ఆమోదం పొందితే ఏడాది కాలం పొడిగించుకునే వీలుంటుంది. శివశంకర్ సెలవులు ముగించుకుని రాగానే విద్యావర్ధిణి నుంచి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు విద్యార్థుల సమస్యలు పరిష్కరించటంలో వీసీ ఏ మాత్రం స్పందించటం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని చెబుతున్నారు స్టూడెంట్స్. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Kadem Forest Missing Farmer: అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - అడవిలో తప్పిపోయిన వృద్ధ రైతు - డ్రోన్లతో పోలీసుల ముమ్మర గాలింపు!
అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - డ్రోన్లతో కడెం పోలీసుల ముమ్మర గాలింపు!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget