అన్వేషించండి

Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!

Adilabad Latest News: తెలంగాణలో ఇంటర్, పదోతరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షల్లో తప్పిపోయిన విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేక క్లాస్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పదో తరగతి, ఇంటర్ తప్పిన విద్యార్థులకు విద్యాశాఖ ప్రత్యేక కోచింగ్ అందిస్తుంది.
  • ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు.
  • మే 11 నుండి విద్యాశాఖ వారోత్సవాలు, పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడతారు.
  • 88 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు, మౌలిక వసతులకు చర్యలు.

Adilabad Latest News: తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ , పదో తరగతి తప్పిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి కోసం ప్రత్యేక క్లాస్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఏ సబ్జెక్ట్ తప్పారో దానిపై వారికి ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని విద్యాశాఖాధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణ వెల్లడించారు. 

 ఫెయిల్ విద్యార్థులకు కోచింగ్‌తోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని యోగిత రాణ అన్నారు. గురువారం హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అకాడమిక్ ప్యానెల్ విజిత్, ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతుల కల్పన అధార్/అపార్ యూ డ్రెయిన్ పురోగతి బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణ పురోగతి కస్తూరిబా గాంధీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఎస్ ఎస్ సి, ఇంటర్ తప్పిన విద్యార్థులకు కోచింగ్, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా విద్యా శాఖ వారోత్సవాలు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సమీకృత కలెక్టరేట్ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కాన్ఫరెన్స్, కార్యక్రమానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యువరాజ్ మార్మట్‌తో కలిసి కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. ఈ డబ్ల్యు ఐడిసి ఇంజినీరింగ్ అధ్వర్యంలో పాఠశాలలో చేపడుతున్‌న మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 88 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. 

ప్రీ ప్రైమరీ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీకి కోసం కోచింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాలను మే 11 నుంచి పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. వారోత్సవాలలో భాగంగా పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతుల పనులు చేపడతామన్నారు. విద్యార్థులకు కోచింగ్ ఏర్పాటు చేయడం సర్పంచ్, కౌన్సిలర్లతో వర్క్ షాప్ నిర్వహించడం జయశంకర్ బడి బాట కార్యక్రమాలను పకడ్బందీగా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
 

Frequently Asked Questions

ఇంటర్, పదో తరగతి తప్పిన విద్యార్థులకు విద్యాశాఖ ఏమీ చేయబోతోంది?

తప్పిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ఏ సబ్జెక్ట్ లో తప్పారో దానిపై ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు ఎలాంటి సూచనలు వచ్చాయి?

కోచింగ్ తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

విద్యాశాఖ వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు?

ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాలను మే 11 నుంచి పకడ్బందీగా నిర్వహిస్తారు.

ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ని ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు?

88 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. వాటికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget