Kumaram Bheem Asifabad Latest News: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జీవో నంబర్ 49కు వ్యతిరేకంగా పోరు తీవ్రం- నిరాహార దీక్ష ప్రారంభించిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్
Kumaram Bheem Asifabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో నెంబర్ 49కు వ్యతిరేకంగా పోరు ఉద్ధృతమవుతోంది. దీనికి వ్యతిరేకంగా సిర్పూర్ ఎమ్మెల్యే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.

Kumaram Bheem Asifabad Latest News: తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో చాలా కాలంగా నలుగుతున్న సమస్య పోడు భూముల ఇష్యూ. దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకొచ్చిన 49వ నెంబర్ జీవో. ఇది కూడా గిరిజనుల ఆగ్రహానికి గురి అవుతోంది. ఈ రెండు సమస్యలపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు దీక్ష చేపట్టారు. కుమ్మం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో తన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
గిరిజనుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు. జీవో నంబర్ 49ను రద్దు చేసి పొడు భూముల సమస్యను పరిష్కరించాలని తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదు అన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు గిరిజనుల హక్కుల కోసం ఎంత వరకైనా వెళ్తామన్నారు.

ఏంటీ జీవో 49 వివాదం
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ఈ జీవో నెంబర్ 49ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా చాలా కాలంగా గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఈ జీవో అమలు అయితే తమ జీవనాధారం దెబ్బతింటుందని ఆవేనద వ్యక్తం చేశారు. 30 మే 225న ఈ జీవోను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్టు, తెలంగాణని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు మధ్య కొమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్‌ను ఏర్పాటు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఈ జీవో అమల్లోకి వస్తే కొమ్రంభీం ఆసిఫాబాద్ కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ సిర్పూర్,కర్జెల్లి, బెజ్జూరు, పెంచికల్ పేట పరిధిలోని 3 లక్షల ఎకరాలు ఈ కారిడార్‌లోకి వెళ్లిపోతాయి. ప్రభుత్వం ప్రకటించిన జీవో ప్రకారం 339 గ్రామాలు ఆ కారిడార్ పరిధిలోకి వస్తున్నాయి. ఆ గ్రామాల ప్రజలు సాగు చేసుకునే రెండు లక్షల ఎకరాలకుపైగా అటవీ భూమి ఐదో షెడ్యూల్ కిందకు వస్తుంది. దీంతో తమ భూములు కారిడార్‌గా మారిస్తే తాము ఎలా బతకాలని ఆందోళన చేపట్టారు.

జీవో 49కు వ్యతిరేకంగా గిరిజనం నిరసన చేపట్టింది. దీని వల్ల తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని బోరుమంది. భూములు కోల్పోవడమే కాకుండా తమ ఉనికికే ప్రమాదంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి. ఇప్పటికే పోడు భూముల వ్యవహారంలో ఇబ్బంది పడుతున్నామని ఇప్పుడు ఇలాంటి జీవోలు తీసుకొస్తే సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటామని ఆందోళన చెందారు. రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు తమ ప్రాంతానికి వచ్చిన నాయకులందరికీ విషయాన్ని చెప్పారు. మంత్రుల చుట్టూ తిరిగారు. వారితో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఓవైపు గిరిజనుల ఆందోళనలు మరోవైపు రాజకీయ ఒత్తిళ్లో జీవో నెంబర్ 49ను తాత్కాలికంగా నిలివేస్తున్నట్టు ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది. గిరిజనుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే జీవోను శాశ్వతంగా రద్దు చేయాలని గిరిజనులు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే హరీష్ దీక్ష చేపట్టారు.





















