అన్వేషించండి

Minister Indrakaran Reddy : రైతుల పట్ల కేంద్రం వైఖరి దారుణం, కల్లాల నిధులు వెనక్కి ఇవ్వమనడం సరికాదు- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister Indrakaran Reddy : ధాన్యం కల్లాల కోసం ఖర్చు చేసిన ఉపాధి హామీ నిధులు వాపస్ చేయమని కేంద్రం తెలంగాణను ఆదేశించింది. ఈ నిర్ణయంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు.

Minister Indrakaran Reddy : రైతుల ప‌ట్ల కేంద్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులు, పేద ప్రజ‌ల పాలిట శాపంగా మారాయన్నారు. వ్యవ‌సాయ క‌ల్లాల‌కు ఉపయోగించిన ఉపాధి హామీ నిధులు వెనక్కి ఇవ్వమ‌న‌డం స‌రికాదన్నారు. వెంట‌నే ఆ నిర్ణయాన్ని కేంద్రం వెన‌క్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖ‌రికి నిర‌స‌గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో చేప‌ట్టే ధర్నా కార్యక్రమాల‌ను జయప్రదం చేయాలని  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. 

రైతు వ్యతిరేక విధానాలు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై  రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. క‌ల్లాల నిర్మాణం పూర్తయ్యాక, వ్యవ‌సాయ క‌ల్లాల‌కు ఉపాధి హామీ నిధులు ఇవ్వననడం స‌రికాదన్నారు. వెంట‌నే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల‌ని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల‌కు న‌ష్టం చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా  వ్యతిరేకిస్తుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ ప్రెసిడెంట్ తారక రామారావు ఆదేశాలతో కేంద్రం అవలంభిస్తున్న రైతు, వ్యవ‌సాయ కూలీల‌ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో చేప‌ట్టే ధర్నా కార్యక్రమాల్లో రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రేపు(శుక్రవారం) నిర్మల్ ప‌ట్టణంలో నిర్వహించే ధ‌ర్నాలో తాను కూడా పాల్గొనున్నట్లు మంత్రి తెలిపారు.  

రైతన్నల పొట్ట కొడుతుంది కేంద్రం 

గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రిన‌గ‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తూ, రైతాంగానికి, సామాన్య ప్రజానికి తీవ్ర నష్టం చేసే  నిర్ణయాల‌ను తీసుకుంటుంద‌ని మండిపడ్డారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవ‌హ‌రిస్తూ... వివ‌క్ష చూపుతుంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హ‌మీ ప‌థ‌కం కింద నిర్మించిన క‌ల్లాల‌కు నిధులు ఇవ్వకుండా మోకాల‌డ్డుతుంద‌ని కేంద్ర ప్రభుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. రైతుల‌కు ప్రత్యక్షంగా ఉప‌యోగ‌ప‌డే క‌ల్లాలు వ్యవ‌సాయంలో భాగం కాద‌ని  వ‌క్రభాష్యాలు చెప్పి రైతన్నల‌ను, వ్యవ‌సాయ కూలీల పొట్ట కొడుతుంద‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిప‌డ్డారు. రైత‌న్నలు ఆర్థికంగా బ‌లోపేతం కావాల‌ని సీఏం కేసీఆర్ ఎన్నో రైతు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటే... కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలోనే అతిపెద్దదైన వ్యవ‌సాయాన్ని రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంద‌న్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత‌ల‌ను ఆదుకునేలా కేంద్రానికి ఒక్క విధానం కూడా లేదని విమర్శించారు.

మండిపడ్డ మంత్రి హరీశ్ రావు 

రైతుల కోసం కల్లాలను నిర్మించడం తప్పని కేంద్రం అంటుందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పంట పొలాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు కల్లాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్లాలను నిర్మించడం తప్పని, కల్లాల నిర్మాణం కోసం ఖర్చు చేసిన రూ.150 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లాలు కట్టకుండా బిల్లు పెడితే తప్పు కానీ కల్లం కడితే తప్పంటేని మంత్రి ప్రశ్నించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని నిలదీవారు. బీజేపీ ప్రభుత్వం చేపలు ఎండబెట్టుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చిందని, చేపలు ఎండబెట్టుకునేందుకు కల్లాలు కడితే తప్పులేదా? అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ మేనిఫెస్టెలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారని, రెట్టింపు చేయలేదు కానీ పెట్టుబడి రెట్టింపు చేశారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
Embed widget