అన్వేషించండి

Telangana BJP : తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?

Telangana News : తెలంగాణలో బీజేపీ అన్ని సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అయినా కొన్ని చోట్ల మార్చాలన్న ఒత్తిడి పెరిగిపోతోంది.

Telangana BJP Tickets Change : తెలంగాణ బీజేపీ  తరపున పోటీ చేయబోయే అన్ని స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు సమయం ఉండటంతో అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి.  పలువురు బీజేపీ అభ్యర్థులను కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్ అభ్యర్థులను మార్చాలని బీజేపీ క్యాడర్ పట్టుబడుతోంది. అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్న నేతలు మార్పు కోసం పట్టుబడుతున్నారు. హైదరాబాద్ టికెట్ మాధవీలతకు ఇవ్వడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల సైదిరెడ్డి, ఆరూరి రమేశ్ లను మార్చాల్సిందేనని బీజేపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది.                 
  
సైదిరెడ్డి, ఆరూరి రమేశ్ లకు వ్యతిరేకంగా వరంగల్, నల్గొండ జిల్లా బీజేపీ నేతలు ఒక్కటయ్యారు. ఆదిలాబాద్ టికెట్ ను నగేశ్ కు కేటాయించడాన్ని సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు, రమేశ్ రాథోడ్ వ్యతిరేకిస్తున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ ప్రకటించిన మరుసటి రోజే కాంగ్రెస్  సీఎం రేవంత్ రెడ్డిని బంగారు శృతి కలిశారు. అభ్యర్థులను మార్చకుంటే ఎన్నికల్లో సహకరించేది లేదని పార్టీ కేడర్ తెగేసి చెబుతోంది. బీజేపీలో ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి 15 రోజులు అవుతున్నా.. ఇంకా అసంతృప్తుల సెగ మాత్రం తగ్గడం లేదు. 

భారతీయ జనతా  పార్టీ నేతలు వలస నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కారణంగా   బీజేపీలో ఎప్పటి నుంచో కార్యకర్తలు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చి టికెట్లు దక్కించుకున్న వారికి సహకరించేది లేదని కేడర్ తెగేసి చెబుతోంది. ఈ క్రమంలో ప్రచారంలోకి వెళ్లేందుకు అభ్యర్థులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ స్థానాల్లో అసంతృప్తుల సెగ ఎక్కువగా ఉంది. వరంగల్ టికెట్ ను ఆరూరి రమేశ్ కు ఇవ్వడాన్ని బీజేపీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. ముందు నుంచి జెండా మోసిన నేతలకు టికెట్లు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆరూరి రమేష్ గతంలో తమపై రాళ్ల దాడులు కూడా చేయించారన్నారు.                                 

నల్గొండలో సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని కేడర్ తప్పుపడుతోంది. గతంలో   ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన వ్యక్తికి ఎలా సహకరించాలని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఎన్నికల్లో బీజేపీ తరపున సిద్ధంగా ఉన్నారు. ఆయన పేరును ఖరారు చేయాలన్న డిమాండ్ వినపిిస్తోదంి. అయితే  బీజేపీ హైకమాండ్.. ఓ సారి ప్రకటించిన పేర్లను ఎంతో అత్యవసరమైన సందర్భాల్లో తప్ప మార్చని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దాదాపుగా అంతా వీరే అభ్యర్థులుగా ఉంటారని రాష్ట్ర బీజేపీ పెద్దలు స్పష్టమన సంకేతాలు ఇస్తున్నారు.              

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget