అన్వేషించండి

Hyderabad to Yadadri Buses: హైదరాబాద్ - యాదాద్రికి మినీ బస్సులు, టికెట్ రేట్లు ఎంతంటే

ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారులోని ఉప్పల్ సర్కిల్ వ‌ద్దకు బ‌స్సులు నడుస్తాయని, అక్కడి నుంచి మినీ బ‌స్సుల్లో యాదాద్రికి వెళ్లవచ్చని సజ్జనార్ చెప్పారు.

Yadadri Darsini Buses: యాదాద్రికి వెళ్ళే భక్తుల సౌకర్యం కోసం తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) శుభవార్త అందించింది. ‘యాదాద్రి దర్శిని’ పేరుతో టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక ఆర్టీసీ మినీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ కలిసి బుధవారం ప్రారంభించారు. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండపైకి యాదాద్రి దర్శిని పేరుతో ఈ బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం 100 మినీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు.

ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారులోని ఉప్పల్ సర్కిల్ వ‌ద్దకు బ‌స్సులు నడుస్తాయని, అక్కడి నుంచి మినీ బ‌స్సుల్లో యాదాద్రికి వెళ్లవచ్చని సజ్జనార్ చెప్పారు. అంతేకాక, ఉప్పల్ సర్కిల్ వద్దకు రాని జిల్లాల బస్సులు కూడా ఉంటాయి కాబట్టి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి కూడా బస్సులను నడుపుతారని అన్నారు. జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి మినీ బస్సులో అయితే రూ.75 టికెట్ రేటు ఉంటుంద‌ని తెలిపారు. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులు సౌక‌ర్యవంతంగా యాదాద్రి చేరుకోవ‌చ్చని అన్నారు.

ఛార్జీలు పెంచలేదు: బాజిరెడ్డి గోవర్థన్
ఆర్టీసీ ఛార్జీల పెంపు జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ స్పందించారు. ప్రభుత్వానికి పెరిగిన సెస్ చార్జీలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదని.. సెస్ చార్జీలు మాత్రమే పెంచామని అన్నారు. టోల్ ప్లాజా డబ్బులు టీఎస్ ఆర్టీసీ మాత్రమే చెల్లిస్తుందని అన్నారు. ఏటా 70 నుండి 100 కోట్ల వరకూ ఆర్టీసీ నష్టపోతోందని.. ఆర్టీసీ లాభాల కోసమే గతంలో చార్జీల పెంచామని అన్నారు. ఇంత చేసినా రోజు రూ.6 కోట్ల దాకా నష్టపోతున్నామని అన్నారు.

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉద్యోగాల భర్తీపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (TSRTC MD) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం మొత్తం 2 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని సజ్జనార్‌ (VC Sajjanar) వెల్లడించారు. వీఆర్‌ఎస్‌ కోసం ఉద్యోగులను ఎవరినీ యాజమాన్యం బలవంతం చేయట్లేదని అన్నారు. ఎంతమంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుకుంటున్నారనే దాన్ని బట్టి, ఆ సంఖ్య ఆధారంగా ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వంతో మాట్లాడి ప్యాకేజీ సిద్ధం చేసుకుంటామని.. వీఆర్‌ఎస్‌ తేల్చాక ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని సజ్జనార్‌ విలేకరులతో చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget