అన్వేషించండి

Kodad Road Accident:కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను ట్రావెల్ బస్ ఢీ కొట్టింది ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కోదాడ వద్ద బస్సు కంటైనర్‌ను ఢీకొని ఆరుగురు మృతి.
  • ఇరవైమంది గాయాలు; హైదరాబాద్-ఏలూరు బస్సులో 42 మంది ప్రయాణికులు.
  • సీఎం రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ విచారం, మెరుగైన చికిత్సకు ఆదేశాలు.

Kodad Road Accident:సూర్యపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద ఈ వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. 42 మందితో వెళ్తున్న ట్రావెల్ బస్‌ కంటైనర్‌ను ఢీ కొట్టింది. అందులో ఉన్న ఇనుప రాడ్స్‌ బస్‌లో ఉన్న పాసింజర్స్‌ శరీరంలోకి చొచ్చుకెళ్లాయి. దీంతో స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. వీరిలో నలుగురైదుగురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

ప్రమాదానికి గురైన బస్‌ హైదరాబాద్ నుంచి ఏలూరు  వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు అందులో 42 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ప్రమాదంలో మృతి చెందారు. ఈ దుర్ఘటన కారణంగా ఆ రూట్‌లో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ప్రమాదం జరిగిన బస్‌ను కంటైనర్‌ను రోడ్డు పక్కకు తీయడంతో వాహనాలు రాకపోకలు ఈజీ అయ్యాయి.    

ప్రమాదానికి కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగమా లేకుంటే ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు ఆదేశించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు.   

కోదాడ వద్ద ప్రమాదంపై పవన్ విచారం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

సూర్యాపేట, కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సు భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల అప్రమత్తత విషయంలో రాజీ పడకూడదన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు మరింత కఠినంగా పర్యవేక్షించాలన్నారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. 

Frequently Asked Questions

కోదాడ రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగింది?

సూర్యపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్ బస్ కంటైనర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు?

ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు, వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. దాదాపు 20 మంది గాయపడగా, నలుగురైదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా?

అవును, పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా అతివేగమా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన ఏమిటి?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget