అన్వేషించండి

Munugode Election Results: రిజల్ట్స్ ప్రకటించడంలో జాప్యం, నేరుగా కేంద్ర మంత్రి ఫోన్ - బీజేపీ, టీఆర్ఎస్ సీరియస్

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.

Munugode Election Results Delay: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో కాస్త ఆలస్యం కావడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగో రౌండ్ వరకూ ఎప్పటికప్పుడూ ఫలితాలను ప్రకటిస్తూ వచ్చిన అధికారులు ఐదో రౌండ్ లెక్కలు మాత్రం చాలా జాప్యం చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని కిషన్ రెడ్డి సీఈవోను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్ లోడ్ చేశారు. 

బండి సంజయ్ ఆగ్రహం
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా సీఈవో ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని విమర్శించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని బండి సంజయ్ నిలదీశారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

ఎన్నికల కమిషన్ స్పందించాల్సిందే  - మంత్రి జగదీష్ రెడ్డి
రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం కావడంపైన మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల జాప్యంపైన మీడియా ప్రతినిధులు కూడా నిరసన తెలిపారు.

స్పందించిన కలెక్టర్
అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడకుండా కొన్ని మీడియా ఛానళ్లు లేదా కొన్ని ఇతర మాధ్యమాలు ఊహగానాలతో ఫలితాలను ముందస్తుగా, ఊహిస్తూ ప్రసారం చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి అన్నారు. కాబట్టి, =వాటిని అధికారికమైన వాటిగా పరిగణనలోకి తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి కోరారు. ఇప్పటివరకు కేవలం మూడవ రౌండ్ ఫలితాలు మాత్రమే అధికారికంగా వెలువడ్డాయని ఆయన తెలిపినట్లుగా జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) ఓ ప్రకటన విడుదల చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Sathupally NDRF Rescue: సత్తుపల్లి వరదలో గల్లంతైన 11 మంది SDRF సిబ్బంది సేఫ్.. రక్షించిన ఎన్డీఆర్ఎఫ్!
సత్తుపల్లి వరదలో గల్లంతైన 11 మంది SDRF సిబ్బంది సేఫ్.. రక్షించిన ఎన్డీఆర్ఎఫ్!
Telangana Graduates MLC Election: ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.. పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్!
ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.. పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Harish Rao On Mallanna Sagar: మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sachin -Sooryavanshi Critique: 15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు
15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు, వన్డే ఫార్మాట్ మార్పులకు పిలుపు
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Embed widget