అన్వేషించండి

Khammam News: రిక్షాలో స్నేహితుడి డెడ్‌బాడీ- కన్నీళ్లతో ఆ నలుగురు- హృదయాన్ని మెలిపెట్టే సన్నివేశం

సొంతూరు వెళ్లిపోయేందుకు ఐదుగురు స్నేహితులు టికెట్లు తీశారు. ట్రైన్ ఎక్కారు. ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక కాస్త నలతగా ఉందని ట్రైన్ దిగాడు ములకరాజ్. అక్కేడ విశ్రాంతి తీసుకొని తుది శ్వాస విడిచాడు

నలుగురు స్నేహితులతో కలిసి ఊరుకాని ఊరు వచ్చాడు. ఐస్‌క్రీం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నా ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. మొదట చిన్న గాయాలే అనుకున్నారంతా. తర్వాత కానీ తెలియలేదు అది ఎంత ప్రమాదకరమో. ముప్పును గ్రహించి సొంతూరు పయనమయ్యారు. కానీ ఇంతలోనే మరో ఘోరం జరిగిపోయింది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనోజ్‌ జిల్లా ధ్యాస్‌పూర్‌కు చెందిన 37 ఏళ్ల ములకరాజ్‌ పొట్టకూటి కోసం తెలంగాణ వచ్చాడు. నలుగురు స్నేహితులతో కలిసి వచ్చిన అతను... సూర్యపేటలో వ్యాపారం మొదలు పెట్టాడు. అయిటిపాముల వద్ద ఐస్‌క్రీంలు విక్రయిస్తుండగా ప్రమాదం జరిగింది. ఓ టూవీలర్ వచ్చి ఢీకొట్టింది. గాయాలపాలైన అతన్ని నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు సూర్యపేట వెళ్లాలని రిఫర్ చేశారు.  

ములకరాజ్‌ను పరీక్షించిన సూర్యపేట వైద్యులు... పరిస్థితి బాగాలేదని... మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అయితే భారీ ఖర్చుకు భయపడిన స్నేహితులు.. ఇంటికి తీసుకెళ్లిపోవాలని నిర్ణయించారు. విషయాన్ని స్నేహితుడు ములకరాజ్‌కు కూడా చెప్పారు. అతను కూడా సరే అన్నాడు. సొంతూరు వెళ్లిపోతే పరిస్థితి కాస్త కుదట పడుతుందేమో అనుకున్నాడు. 

సొంతూరు వెళ్లిపోయేందుకు ఐదుగురు స్నేహితులు టికెట్లు తీశారు. ట్రైన్ ఎక్కారు కూడా. మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కాస్త నలతగా ఉందని ట్రైన్ దిగాడు ములకరాజ్. అక్కేడ విశ్రాంతి తీసుకొని తుది శ్వాస విడిచాడు. మళ్లీ ట్రైన్ ఎక్కుదామని స్నేహితులు పిలుస్తుంటే అతనిలో చలనం లేదు. రైల్వే స్టాఫ్ వచ్చి చూస్తే ఊపిరి ఆగిపోయింది. ములకరాజ్ చనిపోయాడని స్నేహితులకు చెప్పారు. 

స్నేహితుడు మరణించాడనే విషయం తెలుసుకున్న ఆ నలుగురు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ప్లాట్ ఫాం నుంచి మార్చురీకి తరలించాలని ఆదేశించారు. స్నేహితులు రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆటోవాలాలను, ప్రైవేట్ వాహనాలను అడిగితే వారు 5 వేల రూపాయలు అడిగారు. అంత డబ్బు తమ వద్ద లేదని.. కనికరించాలని రిక్వస్ట్ చేశారు. ఎవరూ ముందుకు రాలేదు. 

చేతిలో ఉన్న డబ్బులతో ఓ రిక్షా కార్మికుడికి రిక్వస్ట్ చేశారు. ఆయన ఐదు వందలు ఇస్తే వస్తానని చెప్పాడు. అందుకు ఓకే చెప్పిన మిత్రులు ఐదు వందలు ఇచ్చారు. ఆ రిక్షాలో మిత్రుడి శవాన్ని వేసుకొని ఆ నలుగురు స్నేహితులు ఖమ్మం ఆసుపత్రికి వచ్చారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసి సొంతూరికి పయనమయ్యారు. 

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా డెడ్‌బాడీలను తరలించడానికి అంబులెన్స్‌లు వేలకు వేలు డిమాండ్ చేసిన విషయం వైరల్‌గా మారింది. దీంతో కొందరు బాధితులు టూవీలర్స్‌లో మోసుకుంటూ డెడ్‌బాడీలను ఇళ్లకు తీసుకెళ్లారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?

వీడియోలు

Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget