అన్వేషించండి

BRS Meeting: నేడు నల్గొండలో కేసీఆర్ గర్జన - ప్రాజెక్టులపై పోరాటమా? లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖమా?

BRS Meeting: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తున్నారన్న కారణంతోనే నల్గొండ సభకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌... అక్కడ ఏం తీర్మానం చేయనుందో చూడాలి.

BRS Meeting: తెలంగాణలో అధికార పార్టీపై అప్పుడే సమర శంఖం పూరించబోతున్నారు మాజీ సీఎం,బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌. నేడు నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడాన్ని నిరసిస్తూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ జనంలోకి వస్తున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ బైపాస్‌ రోడ్డులో సాయంత్రం మూడు గంటలకు సభ ప్రారంభం కానుంది. రైతు గర్జన పేరిట ఈ సభను బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఎక్కడా బహిరంగంగా మాట్లాడింది లేదు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన స్పందించలేదు. ఇప్పుడు ఇవాళ్టి సభలో ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి అందరిలో ఉంది. 

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకరించాయి. అయితే ఇది తెలంగాణలో రాజకీయంగా పెను దుమారాన్ని రేపింది. దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్న బీఆర్‌ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. లోక్‌సభ ఎన్నికలు ఉన్న వేళ దీన్ని మరింత సాగదీసే ఉద్దేశం లేని ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రానికి అప్పగించడం లేదని ప్రకటించింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. 

దీన్ని కూడా బీఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇది తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్‌ విజయమని పేర్కొంది. నల్గొండ సభ ఉన్నందునే మిగతా బిజినెస్‌ను పక్కన పెట్టి దీనిపై చర్చించారని ఆరోపించింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల అంశం అసెంబ్లీలో పెద్ద చర్చకే దారి తీశాయి. రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తున్నారన్న కారణంతోనే నల్గొండ సభకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌... అక్కడ ఏం తీర్మానం చేయనుందో చూడాలి. దీనికి రైతు గర్జన అని పేరు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌... ప్రాజెక్టులపై అల్టిమేటం ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. నదీ జలాలపై ఫోకస్ పెట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఆరు నెలల్లో నదీ జలాల పంపకాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని గడువు ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికి కొత్త ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చినట్టు అవుతుందని తర్వాత మరోసారి పోరుబాటు పట్టవచ్చని అంటున్నారు. 

సభలో చర్చకు కేసీఆర్ రావాలంటూ అధికార పక్షం పట్టుబడుతోంది. అదే టైంలో ఆయన వస్తే మీరు తట్టుకోలేరంటూ బీఆర్‌ఎస్‌ హెచ్చరిస్తోంది. ఇప్పుడు నల్గొండ వేదిక నుంచి కేసీఆర్ గర్జన ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఓవైపు అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కేడర్‌ను మరోసారి లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం చేసే పని కూడా కేసీఆర్ చేయబోతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే బహిరంగ సభను ఏర్పాటు చేశారని అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget